శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల సమస్యా? పరిష్కరించండి ఇలా.

జీవన శైలిని సక్రమంగా అమలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కలిగి ఉంటాము. అస్తవ్యస్త జీవన విధానం కలిగి ఉండడం మద్యపానం మరియు మరికొన్నిటిని నియంత్రణలో ఉంచుకోవడం వలన యూరిక్ యాసిడ్ సమస్యను అధిగమించవచ్చు.

Telugu Mirror : శరీరంలో ప్యూరిన్స్ అనే పదార్థాలు విచ్ఛిన్నమైనప్పుడు ఉత్పత్తి అయ్యే ముఖ్యమైన రసాయనం యూరిక్ యాసిడ్ (Uric acid).ప్యూరిన్లు అనేవి శరీరంలో సంభవిస్తాయి. అలాగే కొన్ని ఆహారాలు మరియు పానీయాలలో కూడా ఉంటాయి. మాకేరల్, బఠాణి,ఎండిన బీన్స్ మొదలైన వాటిలో వీటి మోతాదు అధికంగా ఉంటుంది. దేహంలో యూరిక్ యాసిడ్ సాధారణ మొత్తంలో హానికరమైనదిగా పరిగణించబడనప్పటికీ దాని పెరుగుదల అనేక రకాల ఆరోగ్య ఇబ్బందులను కలిగిస్తుంది.

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే ఆర్థరైటిస్(Arthritis), వేళ్ళల్లో నొప్పి , మూత్రపిండాలలో రాళ్లు వంటి సమస్యలు అధికమవుతాయి. కాబట్టి పోషకాహారం మరియు జీవన శైలి సక్రమంగా ఉంటే యూరిక్ యాసిడ్ సమస్యలను నియంత్రణలో ఉంచవచ్చు.శరీరంలో అధికంగా యూరిక్ యాసిడ్ విడుదల అయితే లేదా మూత్రపిండాలు సరిగా పనిచేయకపోయిన రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. తద్వారా కాలం గడిచే కొద్దీ యూరిక్ యాసిడ్ స్పటికాలు తయారవుతాయి.

Also Read : కెరాటిన్ ట్రీట్మెంట్ తో మెరిసే జుట్టు మీ సొంతం, డబ్బు మితం పోషణ అమితం.

ఈ సమస్య యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యలు తెలుసుకుందాం.

శరీరంలో యూరిక్ యాసిడ్ అధికం అవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. శరీరంలో యూరిక్ ఆసిడ్ పరిమాణం ఎక్కువైతే హైపర్యూరిసేమియా కు కారణం అవుతుంది.హైపర్యూరిసేమియా (Hyperuricemia)  మరియు యూరిక్ యాసిడ్ రెండు వేగంగా కలిసి స్పటికాలుగా ఏర్పడతాయి. ఈ స్పటికాలు కీళ్లల్లో పేరుకుపోయి ఆర్థరైటిస్ మరియు గౌట్ సమస్యను అధికం చేస్తాయి. వీటి వల్ల మూత్రపిండాలలో రాళ్లు మరియు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను పెంచేలా చేస్తాయి.

Is increased uric acid in the body a problem? Solve it like this.
image credit : tv9 telugu

ప్యూరిన్లు (Purines)  కొన్ని ఆహారాలలో సాధారణంగా కనిపించే సమ్మేళనాలు. శరీరం ప్యూరిన్లను విచ్ఛిన్నం చేయడం వలన అది యూరిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది. దీనిని నివారించాలంటే బీర్, వైన్ ,పాల ఉత్పత్తులు మరియు రెడ్ మీట్ వీటిల్లో అధికంగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం తగ్గించాలి. సరైనా ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించవచ్చు.

Also Read : నడకతో ఆరోగ్యం మీ సొంతం, ఎక్కువగా నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో!

శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే సమస్యలు మరియు గౌట్ సమస్యల నుండి రక్షించడంలో దోహదపడుతుంది. ఊబకాయం లేదా స్థూలకాయం అధికమవడం వల్ల గౌట్ ప్రమాదాన్ని కూడా పెంచేలా చేస్తుందని అధ్యయనంలో కనుగొన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరు తమ బరువును అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల డయాబెటిస్ మరియు గుండెజబ్బులు ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

అధికంగా ఆల్కహాల్ మరియు చక్కెర పానీయాలు అనగా సోడా మరియు ప్యాక్ చేసిన జ్యూస్ వంటివి తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి తద్వారా గౌట్ వ్యాధి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ మరియు చక్కెర పానీయాలు ఆహారంలో అవసరంలేని క్యాలరీలను జోడిస్తాయి. తద్వారా శరీర బరువు పెరగడంతో పాటు జీవక్రియకు సంబంధించిన సమస్యలను అధికం చేస్తాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడం వల్ల ఇతర సమస్యలను కలిగిస్తాయి.

Is increased uric acid in the body a problem? Solve it like this.
image credit : youtube

కాబట్టి ప్యూరిన్లు కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. మద్యపానం మరియు చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. వీటితోపాటు సక్రమమైన ఆహారము మరియు జీవనశైలి ఉండేలా చూసుకోవడం వలన ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.