Telugu Mirror: మీరు సరిగ్గా నిద్రించడం లేదా? అయితే మీరు రోగాలను మూటకట్టుకున్నట్టే..

Telugu Mirror: కొంతమందికి రెగ్యులర్ గా కడుపులో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీనికి కారణం క్రమ రహిత నిద్ర విధానం. మీరు ఎక్కువ సేపు మేల్కొని ఉండటం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. దీని వలన జీర్ణ వ్యవస్థ(Digestive System)పై దుష్ప్రభావం పడుతుంది. సరైన నిద్రా విధానాలు లేకపోవడం వల్ల పేగులో హానికరమైన బ్యాక్టీరియా వస్తుందని పరిశోధనలో కనుగొన్నారు. ఈ విధమైన బ్యాక్టీరియా(Bacteria)జీర్ణ క్రియను నాశనం చేయడమే కాకుండా మంచి బాక్టీరియాని కూడా పాడు చేస్తుంది.

శరీరంలో అంతర్గత జీవగడియారం లేదా సిర్కా డియన్ రిథమ్ అనగా జీవక్రియలను లయబద్ధంగా సమన్వయం చేయడం ద్వారా అవి ఒక వ్యక్తి యొక్క ఫిట్ నెస్(Fitness) పెంచడానికి సరైన సమయం లో జరుగుతాయి.

నిద్ర వేళలు సరిగ్గా పాటించకపోవడం వలన అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని అధ్యయనంలో పేర్కొనబడింది. ఈ అధ్యయనంలో కడుపులో వచ్చే సమస్యల గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తక్కువ సమయం నిద్రపోవడం వల్ల అది శరీరం మొత్తం మీద ప్రభావం పడుతుంది. అందరూ ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి ఎనిమిది గంటలకు నిద్ర పోవాలని చెప్పడానికి కారణం ఇదే.

లండన్(London)లోని కిమ్స్ కాలేజ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, నిద్ర సమయాలలో క్రమరాహిత్యాల లోపాల వల్ల శరీరంలో జీవసంబంధమైన చర్యలను ప్రభావితం చేస్తాయని చాలామందికి తెలియదు. ఇంకా ఈ పరిశోధనలో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా కఠినతరం అయ్యే పరిస్థితి ఉందని కనుగొన్నారు.

Image credit: zeenews – india.com

Also Read:Tips for glowing Skin : నాచురల్ చిట్కాలతో సహజసిద్ధముగా మెరిసే చర్మం మీ సొంతం..

లండన్ లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ మరియు పరిశోధన యొక్క సీనియర్ రచయిత డాక్టర్ వెండి హాల్ ఏమన్నారంటే నైట్ షిఫ్ట్ పనిచేసేవారు కి రాత్రి పూట నిద్రలేని కారణంగా వారి ఆరోగ్య పరిస్థితి చాలా కఠిన తరంగా ఉంటుందని అన్నారు. అటువంటి వారికి గట్ బ్యాక్టీరియా(అనగా ఆహారంలోని పోషకాలను గ్రహించి, విషతుల్య పదార్థాలను నాశనం చేస్తుంది, కొవ్వు నిల్వ లను నిర్మూలిస్తుంది.) గట్ లోని సూక్ష్మజీవులు కూర్పు జీర్ణ క్రియ నుండి జీవ క్రియ వరకు ప్రతి ఒక్క పనితీరు మీద ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా వీరి అధ్యయనంలో సుమారు 934 మంది వ్యక్తులు యొక్క మలం, రక్తం మరియు గట్ మైక్రోబయోమ్ సేకరించి, పరీక్షించి సాధారణ నిద్ర వ్యవధి ని అంచనా వేశారు. వీరిలో నిద్రలేకపోవడం వల్ల ప్రేగులలో చెడు సూక్ష్మజీవులను పెంచుతుందని పేర్కొన్నారు. సరైన మరియు క్రమరాహిత్య నిద్ర గల వారిలో ఊబకాయం , కార్డియో మెటబాలిక్ ఆరోగ్యం, గుండెపోటు(Heart attack), మధుమేహం(Sugar)సమస్యలను పెంచుతాయని అధ్యయనాలలో కనుగొన్నారు.

ప్రేగులలో గుడ్ బ్యాక్టీరియా(good bacteria)లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేకపోవడం వల్ల మానసిక ఆరోగ్య రుగ్మతలు మరియు గుండె జబ్బులు ప్రమాదాలు సంభవిస్తాయని అధ్యయనంలో కనుగొన్నారు.

కాబట్టి ప్రతి మనిషికి వారి వయసును బట్టి తగినంత నిద్ర అవసరం. 6 నుంచి 8 గంటలు రాత్రి పూట నిరంతరాయంగా నిద్రపోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.