Mansoon Care : వర్షాకాలం లో శరీర సంరక్షణ.. శ్రేష్ఠమైన పాలను వినియోగించుకునే విధానం .. ఇప్పుడు మీ కోసం

Telugu Mirror : వర్షాకాలం దేహ సంరక్షణ మరియు పోషణ అవసరం మంచి ఆరోగ్యం కోసం మాన్సూన్ సీజన్లో పాలను ఎలా వాడలో తెలుసుకుందాం.వానా కాలంలో వ్యాధులు అలాగే ఇన్ఫెక్షన్లు(Inspection) ఎక్కువగా వచ్చే కాలం. ఈ సీజన్లో మన వ్యాధి నిరోధక శక్తి(Immunity) బలంగా ఉండడానికి, శరీరానికి అదనపు శక్తి మరియు సరైన పోషణ అవసరం. వర్షాకాలంలో అధిక తేమ స్థాయి ఎక్కువ దీనికోసం చల్లని మరియు తీయని పానీయాల కోసం శరీరం ఆత్రుత పడుతుంది. అయితే ప్రాచీన ఆయుర్వేదం మాత్రం ఈ సీజన్లో వేడిగా ఉండే ఆహారం మరియు పానీయాలు తీసుకోవాలని సూచిస్తుంది.

వర్షా కాలంలో వాతదోషం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో సరిగ్గా వండిన ఆహారం మరియు ఉడకబెట్టిన కూరగాయలు అలాగే వేడి సూపులను తీసుకోమని సిఫార్సు చేయబడింది. మాన్సూన్ సీజన్లో ఎండిన అల్లం, ఇంగువ, వెల్లుల్లి మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మన దేహ వ్యవస్థను ఈ కాలంలో అవి సక్రమ మార్గంలో నడిపిస్తాయి.
సంపూర్ణ పోషకాలు కలిగిన ఆహారంగా భావించే పాలకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. పాలను(Milk) సరైన పద్ధతిలో తీసుకోవడం వలన జీర్ణ క్రియను మరియు రోగనిరోధక శక్తిని దేహంలో పెంచుతాయి.

Dal Rice : అన్నం, పప్పు, నెయ్యి పేర్లు వింటేనే నోరూరుతుంది.. మరి ప్రయోజనాలు తెలిస్తే ఇంకెలా ఉంటుంది..

ఆరోగ్యానికి హాని కలిగించే పానీయాలను తాగకుండా వదలిపెట్టాలనే ఆలోచనకు ఉత్తమ మైన మార్గం ఏంటంటే మీ జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులను తీసుకు రావడానికి మార్గాన్ని ఏర్పరచు కోవడమే. ఈ సీజన్ లో కూల్ గా ఉండేవి అలానే చల్లని ప్రెస్డ్ – డ్రింక్స్ తాగాలని అనిపించినా కానీ శరీరం మాత్రం అందుకు విరుద్దంగా పని చేస్తుంది.వర్షాకాలంలో మన శరీర తత్వం మారిపోతుంది.గందరగోళంగా ఉండడం కంటే ప్రశాంతత కలిగి ఉండటం అవసరం. ప్రశాంతత సాధించాలంటే వానా కాలం సీజన్ లో తీసుకోవలసిన ఆహారం తీసుకోవడం వలననే సాధ్యం అవుతుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నితికా కోహ్లీ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేశారు.

Image credit:Hit tv

వర్షా కాలం లో చల్లనివి కాకుండా గోరు వెచ్చని పాలు తాగాలని డాక్టర్ కోహ్లీ తెలిపారు.అలానే పాలలో ఔషధ గుణాలను పెంచాలంటే 1/4 వంతు నీరుని పాలకు కలపాలని నిపుణులు సూచించారు.

వర్షాకాలం లో మీరు పాలను ఏ విధంగా తాగాలో తెలుసుకుందాం.

1.కాచిన పాలు
• చల్లని పాలు లేదా కాచి చల్లార్చిన పాలు కాకుండా వెచ్చని పాలను తాగడం మంచిది.వెచ్చని పాలను తీసుకోవడం వలన అవి జీర్ణ క్రియకు సహాయ పడతాయి. పోషకాల ద్వారా వచ్చిన శక్తిని శరీర మంతా పంపీణీ చేసే శోషణను ఉత్తేజితం చేస్తాయి. మానవ దేహం యొక్క మొత్తం రక్షణకు అండగా నిలుస్తుంది.
పాలను ఎలా మరగ పెట్టాలి:
•పాలలో మీరు 1/4 వంతు పరిమాణంలో నీరు కలపి పాలను మరగించాలి. ఇది అనేక అనారోగ్య పరిస్థితులకు నివారిణిగా ఉపయోగ పడుతాయి.శరీరానికి శక్తిని అలాగే పోషణను ఇస్తాయి.

Nutritious food–పౌష్టికాహార లోపం పిల్లలకు శాపం..తల్లిదండ్రుల మీదే కాపాడే భారం..

2.మసాలా పాలు
• మీరు పాలలోయాలకులు,దాల్చినచెక్క,
పసుపు అలాగే అల్లం మొదలగు ఆయుర్వేద సుగంధ మసాలా ద్రవ్యాలను కలపడం వలన పాల యొక్క జీర్ణ పద్దతులను డెవలప్ చేస్తుంది.
పైన సూచించిన విధంగా పాలు త్రాగడం వలన మీలో రోగ నిరోధకశక్తి అభివృద్ది చెందుతుంది మరియు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.