తెల్ల జుట్టును, కేశ సమస్యను మాయం చేసే గోరింటాకును వాడండి ఇలా

భారతీయ సాంస్కృతిక జీవనంలో గోరింటాకు కూడా ఒక భాగం, పురాతన కాలం నుండి మహిళలు గోరింటాకును వివిధ రకాలుగా వాడుతుంటారు.

Telugu Mirror: భారతదేశంలో గోరింటాకు కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన మహిళలు అమ్మాయిలు తమ చేతులకు మెహిందీ పెట్టుకుంటారు. చేతులకు మాత్రమే కాదు జుట్టుకు కూడా గోరింటాకును పెట్టుకుంటారు. తెల్లగా మారిన జుట్టును కవర్ చేయడం కోసం గోరింటాకును పెడుతుంటారు. గోరింటాకు తెల్ల జుట్టు రంగును మార్చడంతో పాటు జుట్టు సమస్యలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గోరింటాకును జుట్టుకు పెట్టుకోవడం వలన జుట్టును బలంగా, ఒత్తుగా మరియు మెరిసేలా చేస్తుంది. కొంతమంది జుట్టుకు రంగు వేసుకోవడానికి భయపడుతుంటారు. అటువంటి వారి కోసం ఇవాళ మీకు మేము కొన్ని విషయాలను తెలియజేస్తున్నాము.
గోరింటాకును జుట్టుకి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియజేస్తున్నాం.

Image Credit: Flower Aura

గోరింటాకును జుట్టుకు తరచుగా అప్లై చేయడం వలన ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని పొందవచ్చు.

గోరింటాకు ను జుట్టుకు పెట్టుకోవడం వలన సహజంగానే కండీషనర్ గా పనిచేస్తుంది. గోరింటాకును క్రమం తప్పకుండా తలకు పెట్టుకోవడం వలన జుట్టులో అవసరమైన తేమను అలానే ఉంచుతుంది. దీంతో జుట్టు సిల్కీ (silky hair) గా మారుతుంది. గోరింటాకును తలకు ఉపయోగించిన తర్వాత మీకు అధిక రసాయనాలతో కూడిన కండీషనర్ అవసరం లేదు.

గోరింటాకును తరచుగా పెట్టుకోవడం వలన జుట్టును బలంగా మరియు దృఢంగా చేస్తుంది. ఈ హెన్నా (Henna) ను నెలకు రెండుసార్లు ఉపయోగించవచ్చు. జుట్టుకు అధిక ప్రయోజనాలు పొందాలనుకుంటే గోరింటాకు, ఉసిరికాయలను పేస్ట్ చేసి తలకు అప్లై చేయడం వలన జుట్టుకు మంచి ప్రయోజనాలు అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

తలకు గోరింటాకు పెట్టుకోవడం వలన చుండ్రు సమస్య తొలగిపోతుంది. దీనికోసం మెంతులను రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు నానబెట్టిన మెంతులు మరియు గోరింటాకు కలిపి కలిపిమెత్తగా పేస్ట్ చేయాలి. దీనిని అప్లై చేయడం వలన తలలో ఉన్న ఇన్ఫెక్షన్ మరియు చుండ్రును నివారిస్తుంది.

ఆవాల నూనెలో, గోరింటాకు మరియు కొన్ని మెంతులు వేసి సన్నని మంటపై రంగు మారేవరకు వేడి చేయాలి. చల్లారిన తర్వాత వడకట్టి జుట్టుకు పట్టించాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా చుండ్రు (Drandruff) సమస్య తొలగిపోతుంది.

తెల్ల వెంట్రుకలను కవర్ చేయడానికి గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం గోరింటాకును పేస్ట్ చేసి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల తెల్లగా మారిన జుట్టు నల్లగా మారే అవకాశం ఉంటుంది.
గోరింటాకును తలకి అప్లై చేయడం వలన కండిషనర్ గా పనిచేస్తుంది మరియు చుండ్రును తొలగిస్తుంది. తెల్ల వెంట్రుకల (White Hair) ను కవర్ చేస్తుంది.
కాబట్టి గోరింటాకును తలకు పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను అందిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.