క్రమ రహిత జీవన విధానం, సరైన పోషకాహార తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వివిధ రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో తొడ కండరాలు (muscles) మరియు పిక్కలు పట్టేయడం ఒకటి.
పగలు ఎలా ఉన్నా రాత్రి నిద్రలో మాత్రం పిక్కలు లేదా తొడ కండరాలు పట్టేస్తుంటాయి. ఇలా పట్టేయ డానికి అనేక కారణాలు ఉన్నాయి. వయసు మీద పడటం మరియు పోషకాహార లోపం వివిధ రకాల ఆటలు ఆడటం మరియు వ్యాయామం (exercise) చేసేటప్పుడు అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, నిద్రలో పిక్కలు లేదా కండరాలు పట్టేయడం వంటివి జరుగుతుంటాయి. నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా పిక్కలు పట్టి విపరీతంగా నొప్పి వస్తుంది.
నిద్రలో తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటే కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
పిక్కలు లేదా కండరాలు పట్టేసి నప్పుడు చాలా నొప్పి వస్తుంది. కాలు కదపడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఐస్ క్యూబ్ ని ఒక క్లాత్ లో వేసి నొప్పి ఉన్నచోట పెట్టాలి. ఐస్ క్యూబ్ లేదా ఐస్ ప్యాక్ ఏదైనా కూడా నొప్పి ఉన్నచోట పెట్టవచ్చు. కొంతసేపు ఈ విధంగా చేయడం వల్ల నొప్పి నుండి కొద్దిగా ఉపశమనం (relief) లభిస్తుంది.
కండరాలు లేదా పిక్కలు పట్టేసి నప్పుడు కొబ్బరి నూనె – ఒక స్పూన్, ఆలివ్ ఆయిల్- ఒక స్పూన్, ఆవ నూనె – ఒక స్పూన్. మూడింటిని ఒక గిన్నెలో వేసి కలిపి గోరువెచ్చగా (warm) వేడి చేయాలి. ఈ నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్నచోట రాసి మర్దన చేయాలి. నూనె రాసి మర్దన చేయడం వలన పట్టేసిన కండరాలు లేదా పిక్కలు ఫ్రీ అవుతాయి. దీంతో నొప్పి తగ్గుతుంది.
Also Read : Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.
కొంతమంది నీటిని తక్కువగా తాగుతుంటారు. ఇటువంటివారు డి- హైడ్రేషన్ కు గురవుతారు. డి- హైడ్రేషన్ సమస్య ఉన్నవారికి కూడా ఇలా కండరాలు లేదా పిక్కలు పట్టడం జరుగుతుంటాయి. ఒకవేళ నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నవారు నిద్రలో పిక్కలు (calf of leg) లేదా కండలు కండరాలు పట్టేసి నప్పుడు వెంటనే నీరు తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
శరీరంలో పొటాషియం లోపించినప్పుడు కూడా పిక్కలు లేదా కండరాలు పట్టేస్తుంటాయి. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు అరటి పండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read : Sesame Seeds Benefits : శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే నువ్వులు
కొబ్బరి నూనెలో కొన్ని లవంగాలు (cloves) వేసి వేడి చేయాలి. కండరాలు లేదా పిక్కలు పట్టేసిన దగ్గర రాయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
కాబట్టి నిద్రలో కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటే ఇటువంటి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చక్కటి ఉపశమనం కలుగుతుంది.