Nipah Vairus : కేరళను వణికిస్తున్న నిపా వైరస్, పలు ప్రాంతాలలో ఆంక్షలు

నిపా వైరస్ ప్రస్తుతం కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతుంది . దీని బారిన పది ఇప్పటికే కొంతమంది మృతి చెందారు . రాస్ట్రం అంతా వ్యాపించకుండా ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది .

కేరళలో ప్రస్తుతం నిపా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ రాస్ట్రం మొత్తం ప్రభలకుండా ప్రస్తుతం కోజికోడ్ లో కోవిడ్ తరహా ఆంక్షలను విధించింది కేరళ ప్రభుత్వం.

నిపా (Nipah ) వ్యాధిగ్రస్తునితో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తను బుధవారం పరీక్షించగా  పాజిటివ్‌గా (Positive)  తేలింది . దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌లు మరియు ఆంక్షలను ప్రకటించింది . 700 మంది ఈ వైరస్ బారిన పడినారని . ఈ 700 మందిలో 77 మంది అధిక ప్రమాద కేటగిరీలో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కోజికోడ్ లో కొన్ని ఆంక్షలను విధించారు. ప్రజలు ఈ పరిమితులను పాటించడం ద్వారా ప్రమాదకర వైరస్ ను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తోడ్పడాలని పేర్కొన్నారు.

హైరిస్క్ లో ఉన్న నిపా రోగులు తమ నివాసాలలోనే ఉండాలని చెప్పారు . నిపా వైరస్ సోకి మరణించిన ఇద్దరు నిపా రోగులు నివసించే మార్గాలు తెలియపరచామని తద్వారా ప్రజలు (People) ఆ మార్గాలను వినియోగించవద్దని తెలిపారు .

కోజికోడ్‌లో, పండుగలు మరియు ఫంక్షన్లలో(Functions) అత్యధిక సంఖ్యలో ప్రజలు గుంపులుగా చేరవద్దని ఆంక్షలు విధించారు .

Nipah Vairus : Nipah virus is shaking Kerala, restrictions in many areas
image credit : India Tv News

 

కోజికోడ్ జిల్లాలోని వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీల్లోని 58 వార్డులను కంటైన్‌మెంట్ జోన్‌ (Jone) లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాలలో అవసరమైన సేవల రాక పోకలను మాత్రమే అనుమతించబడతాయి. నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంచడానికి అనుమతించారు.  మెడికల్ షాప్ లు మరియు ఆరోగ్య కేంద్రాలకు ఎటువంటి పరిమితులు విధించలేదు. కంటైన్మెంట్ జోన్ల మీదుగా జాతీయ రహదారులపై ప్రయాణించే బస్సులు (Buses) ఇతర వాహనాలు ఈ ప్రదేశాలలో ఆపకూడదు.

కోజికోడ్‌లో తొమ్మిదేళ్ల బాలుడు ఇన్‌ఫెక్షన్‌ (Infection)  కి గురిఅయ్యాడు బాలుని చికిత్స కోసం ప్రభుత్వం ICMR నుండి మోనోక్లోనల్ యాంటీబాడీని తెప్పించింది. ఇది నిపాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని  వైద్యపరంగా ఏ విధమైన రుజువు  లేదు కానీ ఇది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నచికిత్స . బాలుడు ప్రస్తుతం వెంటిలేటర్ ( Venti later) పై ఉన్ప్స్తతం ఈ వైరస్  కోజికోడ్‌లో వ్యాప్తి చెందగా, డబ్ల్యూహెచ్‌ఓ మరియు ఐసిఎంఆర్ అధ్యయనాల ప్రకారం కేరళ (Kerala) మొత్తం ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉందని మంత్రి వీణా జార్జ్ అన్నారు.

ఇప్పుడు కేరళలో కనుగొనబడిన నిపా జాతి బంగ్లాదేశ్ వేరియంట్, ఇది ప్రభావం తక్కువ కలిగిన అంటువ్యాధి కాని మరణాల రేటు మాత్రం అధికంగా ఉంది. ఈ వైరస్ మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుంది.

Also Read : Respiratory Syncytial Virus : పిల్లలకు ప్రమాదకరం RSV వైరస్..నివారణకు టీకానే మార్గం..పెద్దలకూ సోకే అవకాశం..

Back Pain : స్థిరమైన నడుము నొప్పి క్యాన్సర్ కు దారి తీస్తుందా? వైద్య నిపుణుల మాట ఏమిటి మరి?

Migraine Heading : మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా?

నిపా అనేది జూనోటిక్ వైరస్ , ఈ వైరస్ సోకిన జంతువుల ద్వారా లేదా కలుషితమైన ఆహారం నుండి మానవులకు సోకుతుంది. అది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది . ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు వంటి లక్షణాలు తీవ్రమైన పరిస్థితులలో మెదడు (Brain) వాపుగా మారి బ్రెయిన్ డెత్‌ (Death) కు దారితీసి మరణం సంభవిస్తుంది .

కేరళలో(Kerala) ఇంతకుముందు కూడా  నిపా వైరస్ వ్యాప్తి  చెందింది .  2018లో మరియు 2019 మరలా 2021 లో కొన్ని  కేసులు వెలుగు చూశాయి. 2018 లో 18 మంది రోగులకు వైరస్ సోకగా 17 మంది మరణించారు.

కేరళలో నిపా వ్యాప్తి వలన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాను కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జిల్లాలోకి వచ్చే సరకుల రవాణా వాహనాలను తనిఖీ చేయాలని , సరిహద్దు పాయింట్ల వద్ద చెక్‌పోస్టులను (Check post) తెరవాలని ఆరోగ్య శాఖ పోలీసులను కోరింది. కేరళ నుంచి కన్నడ రాష్ట్రంలోకి వచ్చే పండ్ల  (Fruits) ను తనిఖీ చేయాలని పోలీసులను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది .

Comments are closed.