Telugu Mirror : రోజువారి ఆహారంలో ఆటంకాలు కారణంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం 115 మిలియన్ల మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కిడ్నీలో ఖనిజాలు మరియు లవణాలు చేరడం వల్ల కిడ్నీ(Kidney)లో రాళ్లు తయారవుతాయి. ఈ సమస్య వచ్చిన వారికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్(Stones in kidney) ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. వాటిల్లో ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, అధిక బరువు, కొన్ని అనారోగ్య సమస్యలు, నీరు తక్కువ మోతాదులో తీసుకోవడం వంటివి ప్రధాన కారణాలు అని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీలో రాళ్లు ఉండటం వలన మీ మూత్ర నాళంలో ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. సహజంగా కిడ్నీలు, ద్రవాలను ఫిల్టర్ చేస్తాయి. అయితే కొన్ని మూలకాలు ఎక్కువ అవడం వల్ల స్పటికాలు ఏర్పడడం మొదలవుతాయి. దీని వలన కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.వైద్యులు ఏమంటున్నారంటే, కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణం శరీరంలో లిక్విడ్స్ లేదా నీటి కొరత ఏర్పడటం వలన కిడ్నీలో స్టోన్స్(Kidney Stones) ఏర్పడతాయి. ద్రవపదార్థాలను తక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం తక్కువగా వస్తుంది. దీని వలన రాళ్ళను ఏర్పరచుకునే పదార్థాలను అధికం చేస్తాయి.
మూత్ర నాళాలలో రాళ్లు ఉన్నప్పుడు అది మూత్రం యొక్క ప్రవాహాన్ని ఆపుతుంది. దీని వలన మూత్రపిండాలు వాపు మరియు ఇతర కఠినమైన సమస్యలకు దారి తీస్తాయి.ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ప్రోటీన్, సోడియం మరియు చక్కెర వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు సమస్యని పెంచుతాయి. ఉప్పు అధికంగా ఉండే ఆహారం కూడా ప్రమాదాన్ని అధికం చేస్తుంది. బచ్చలికూర ,బెండకాయ వంటి వాటిల్లో ఆక్సిలేట్ ఉండటం వలన ఇవి కిడ్నీ సమస్యలు వచ్చేలా చేస్తాయి. వీటిని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. కొన్ని రకాల సప్లిమెంట్ల వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్ళను అధికం చేసేలా చేస్తాయి.
మధుమేహం మరియు అధిక బరువు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే పరిస్థితి రావచ్చు. అధిక బాడీ మాస్ ఇండెక్స్( బిఎమ్ఐ) నడుము పై అధిక కొవ్వు వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది.
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ,గ్యాస్టిక్ సమస్యలు, బైపాస్ సర్జరీ ,శస్త్ర చికిత్స, ఇన్ఫ్లోమేటరీ పేగు వ్యాధి, లేదా దీర్ఘకాలిక విరోచనాలు వంటి వ్యాధుల వలన మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితులలో మూత్రపిండాలు,వ్యర్ధ పదార్ధాలను సరిగా ఫిల్టర్ చేయలేవు. అటువంటి సమయంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఇటువంటి వ్యాధులు ఉన్నవారు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు తగిన మోతాదులో నీరు తీసుకోవడం శరీరానికి అవసరం.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది. పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంచడానికి సంభందిత కథనం తయారు చేయబడింది. పై కథనం లో పేర్కొన్న సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.