Papaya : మీకు తెలుసా? బొప్పాయి పండు తిన్న తరువాత అస్సలు తినకూడని పదార్ధాలు

Papaya : You know? Foods that should not be eaten after eating papaya fruit
Image Credit : Housing

కొన్ని రకాల పండ్లను తిన్న వెంటనే వివిధ రకాల ఆహార పదార్థాలు తింటుంటారు. ఇలా తినడం వల్ల శరీరం లో అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండును తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో ఉండే ఆయుర్వేద లక్షణాలు జీర్ణశక్తిని బలోపేతం చేయడంతో పాటు అనేక రకాల కడుపు ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. చాలామంది బొప్పాయి పండును జుట్టు, చర్మ సమస్యలకు పరిష్కారంగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పండు ని తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండు తిన్న తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తిన కూడదో తెలుసుకుందాం.

Papaya : You know? Foods that should not be eaten after eating papaya fruit
Image Credit : Health Line

గుడ్లు:

బొప్పాయి పండు తిన్న తర్వాత గుడ్డుతో వండిన ఆహారాన్ని తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వికారం, పొట్ట సమస్యలు వంటివి వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

పాల ఉత్పత్తులు:

పాలు, పెరుగు, చీజ్ వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ప్రోటీన్ ల శోషణ లో ముఖ్యపాత్రను పోషిస్తుంది. కాబట్టి బొప్పాయి పండు తిన్న తర్వాత పాలకు సంబంధించిన పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది మరియు కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

Also Read : దానిమ్మ పండు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు

చల్లటి నీరు:

బొప్పాయి పండు తిన్న వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ప్రమాదకరమని మరియు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ బొప్పాయి పండు తిన్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల కడుపు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

Also Read : ఎండు ద్రాక్ష , పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

ఫ్రూట్ సలాడ్:

ఇతర రకాల పండ్లను తిన్న తర్వాత బొప్పాయి పండును తినకూడదు. ఎందుకంటే జీర్ణక్రియ దెబ్బతినే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇతర పండ్లను తిన్న తర్వాత బొప్పాయి పండు తిన్నట్లయితే గ్యాస్, పొట్టలో ఉబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది.

కాబట్టి బొప్పాయి పండు తిన్న వెంటనే ఇటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in