వైరల్ వ్యాధులు (Viral diseases) రావడం సహజం ఎందుకనగా సీజన్ మారుతున్నప్పుడు వైరల్ డిసీజెస్ తరచుగా వస్తుంటాయి.వైరల్ వ్యాధులు వచ్చినప్పుడు శరీరాన్ని రక్షించుకోవడానికి రోగ నిరోధక శక్తి ( Immunity Power ) చాలా అవసరం. ఎందుకంటే వ్యాధుల నుండి సురక్షితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, శరీరంలోని రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలి.
ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. వీటిలో ఉండే కొన్ని మూలికలు (Herbs) రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావంతంగా (Effective) పనిచేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా మరియు ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు వాటిని నివారించాలన్న ( To be avoided ) రోగనిరోధక శక్తి కలిగి ఉండడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి పెరగడానికి అనేక రకాలు పదార్థాలు తీసుకున్నప్పటికీ, ఆయుర్వేద మూలికలు కూడా మరింత బాగా పనిచేస్తాయి.
Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా
Rainy-Season : వానాకాలం.. వ్యాధుల కాలం.. చెక్ పెట్టండి ఇలా..
రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మూలికలు ఏమిటో తెలుసుకుందాం:
తులసి :
ఆయుర్వేదంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. జలుబు, దగ్గు నుండి రక్షించడానికి పూర్వకాలం నుండి దీనిని వాడుతుంటారు.అంతేకాకుండా తులసి నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగినట్లయితే రోగనిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. మధుమేహ (Diabetes) వ్యాధిగ్రస్తులకు (Patients) తులసి చాలా బాగా సహాయపడుతుంది.
అశ్వగంధం:
ఆయుర్వేద మూలికలలో అశ్వగంధం (Ashwagandha) పేరు చాలామంది వినే ఉంటారు. అశ్వగంధ లో ఉండే సమ్మేళనాలు (Compounds) అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తి ని పెంపొందించడానికి అశ్వగంధ పొడిని ( Powder ) పాలతో కలిపి తీసుకోవాలి.
వేప :
వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు మరియు ఆంటీ ఆక్సిడెంట్ల ( Anti-Oxidants ) తో నిండి ఉంటుంది. వైరల్ వ్యాధుల నుండి రక్షించడంలో వేప చాలా సమర్థవంతంగా ( Efficiently ) పనిచేస్తుంది. వేప ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొన్ని లేత వేపాకులను పరగడుపున తినడం వల్ల లేదా వేప రసాన్ని త్రాగడం వల్ల ఈ రెండింటిలో ఏది చేసినా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
త్రిఫల చూర్ణం:
త్రిఫల అనగా ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఈ మూడింటిని కలిపి తయారుచేసిన పొడిని త్రిఫల చూర్ణం అంటారు. ఈ మూడు ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ (Digestion) మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి (Sugar Levels)ని నియంత్రిస్తుంది. త్రిఫల చూర్ణం తీసుకోవడం ఆరోగ్యానికి రకాల ప్రయోజనాలను అందిస్తుంది. త్రిఫల చూర్ణంలో విటమిన్- సి, అమైనో ఆమ్లాలు (Amino acids), మినరల్స్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం (strengthen) చేస్తాయి.
కాబట్టి సీజన్లో వచ్చే వైరల్ వ్యాధుల నుండి త్వరగా బయటపడడానికి మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలి. కాబట్టి వీటిని తీసుకొని రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు.