Telugu Mirror : కొంతమంది నరాల బలహీనత(Nervous weakness) సమస్యతో బాధపడుతూ ఉంటారు. నరాలు శరీరం మొత్తానికి రక్తసరఫరా చేస్తాయి. అన్ని రకాల వయసులో వారు నరాలు ఆరోగ్యంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.నరాలు బలహీన మవ్వడానికి వివిధ కారణాలు ఉంటాయి.ప్రమాదాలు జరిగినప్పుడు. ఆటలు ఆడినప్పుడు అయ్యే గాయాల వల్ల నరాలు దెబ్బ తినే అవకాశం ఉంది.
Business Idea : టెర్రస్ పై బిజినెస్ ఐడియా.. ఇంట్లోనే ఉంటూ అధిక రాబడితో అత్యంత లాభం..
ఇవే కాకుండా డయాబెటిస్(Diabetes), గులియన్- బారే సిండ్రోం వంటి కొన్ని వ్యాధుల వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి.నరాలు బలంగా ఉండడానికి జీవనశైలి మరియు డైట్ సరిగా అనుసరించడం చాలా అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు.మీరు ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లను తీసుకుంటే నరాలు దృఢంగా ఉండడానికి చాలా సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు . ఎటువంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా నరాల బలహీనత నుండి బయటపడవచ్చు తెలుసుకుందాం.
ఆహారంలో ఒమేగా త్రీ(Omega-3)ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మరియు నరాల ఇబ్బందులను తగ్గించడంలో సహాయం చేస్తాయని అధ్యయనాలలో కనుగొన్నారు. ఇవి నరాలు ఆరోగ్యంగా మరియు అభివృద్ధి చేయడానికి ,పనితీరుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని తీసుకోవడం వల్ల నరాలకు బలం చేకూర్చడానికి సహాయపడుతుంది.ఆహారంలో కొన్ని రకాల విత్తనాలను చేర్చడం వలన నరాలను దృఢంగా చేయవచ్చు .అవిసెగింజలు మరియు చియా గింజలు తీసుకోవడం వల్ల నరాలు బలంగా ఉంటాయి. చియా సీడ్స్ లో ఫైబర్ ఉంటుంది మరియు అవిసె గింజలో ఆల్ఫా లినో లెనిక్(Alpha Lino Lenik) అద్భుతమైన మూలం.
Today Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు సోమవారం, జూలై 31, 2023 తిథి ,పంచాంగం
అవిసె గింజలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యం ఉంచడంలో మరియు గుండె వ్యాధుల ప్రమాదాలను నిర్మూలించడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు మరియు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.వాల్ నట్ లలో చాలా పోషకాలు ఉంటాయి. మరియు ఫైబర్, ఓమేగా- 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో కాపర్, మాంగనీస్ ,మరియు విటమిన్ ఇ(Vitamin-E) వంటి పోషకాలు కూడా అధిక మోతాదులో ఉన్నాయి. అలాగే ఇవి గుండె వ్యాధులు మరియు మెదడు వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజు వారి ఆహారంలో వాల్ నట్స్(Wall nuts) చేర్చడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.
సోయాబీన్స్ కూడా ఆహారంలో భాగంగా చేర్చాలి .ఇవి ఫైబర్(Fibre) మరియు ప్రోటీన్లకు మంచి మూలం. సోయాబీన్స్(Soybeans),ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ను శరీరం మొత్తానికి కూడా అందిస్తుంది .సోయాబీన్స్ లో రీబో ఫ్లోవిన్, ఫోలేట్ ,మెగ్నీషియం , పొటాషియం,విటమిన్- కె తో పాటు ఇతర పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇవి నరాలు బలంగా అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి.కాబట్టి నరాల బలహీనత సమస్య ఉన్నవారు ఇటువంటి ఆహార పదార్థాలు రోజువారి డైట్లో చేర్చడం వల్ల ఈ సమస్య నుండి బయట పడే అవకాశం ఉందిసమస్య ఎక్కువగా ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించండి.