Telugu Mirror : మనం రోజువారి ఆహారంలో భాగంగా పండ్లను, కూరగాయలను తీసుకుంటూ ఉంటాము. అయితే సాధారణంగా ప్రతి ఒక్కరూ చేసే పని వాటిని తింటాము కానీ వాటి లోపల ఉన్న విత్తనాలను పడేస్తాము. పండ్లను తినడం వల్ల ఎంత ఉపయోగం ఉందో వాటి గింజలు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పండ్ల యొక్క గింజల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి వాటి లోపల గుజ్జును మాత్రమే తిని వాటి గింజలను పడేసే వాటిలో ఉండే గింజలలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా దాగి ఉన్నాయి. వాటిలో గుమ్మడికాయ(pumpkin) గింజలు ఒకటి.
వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి .ఈ గింజలు మందులకు సమానంగా ప్రభావంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల బి.పి. మరియు షుగర్ వంటి ఇబ్బందులను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడి విత్తనాలలో చాలా పోషక విలువలు ఉన్నాయని పరిశోధనలో కనుగొన్నారు. వీటిని తినడం వలన సంతాన ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచడంలో, రక్తంలో గ్లూకోజ్(Glucose) ను కంట్రోల్ చేయడంలో, ఇలా ప్రతిదాంట్లో కూడా ఈ గింజలు ఉపయోగకరంగా ఉన్నాయి.
వీటిలో ఉండే అనేక రకాల పోషకాలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయని అధ్యయనంలో పేర్కొన్నారు. ఇంకా వీటిలో ఉన్న ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
Vitamin Deficiency: విటమిన్ బి – 12 లోపం మన ఆరోగ్యానికి ఒక శాపం
గుమ్మడి విత్తనాలలో మెగ్నీషియం(Magnesium) సమృద్ధిగా ఉంటుంది. ఇవి మెగ్నీషియం సహజ సిద్ధంగా ఉండే వనరులలో ఒకటి. శరీరంలో జరిగే రసాయన ప్రతి చర్యలకు మెగ్నీషియం చాలా ముఖ్యం. తగిన మోతాదులో మెగ్నీషియం ఉంటే రక్త పోటును అదుపులో ఉంచడంలో, గుండె వ్యాధులను తగ్గించడంలో,ఎముకల నిర్మాణంలో, షుగర్ నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.నరాల,కండరాల పనితీరును
నిర్వహించడానికి మరియు శక్తిని పెంచడంలో కూడా మెగ్నీషియం ముఖ్యమైనది .
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు,మెగ్నీషియం, జింక్ ఉండటం వల్ల మీ గుండెను(Heart) ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఇవి రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.
35 మంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన వారి మీద పరీక్షలు జరిపారు.12 వారాలు పాటు గుమ్మడి విత్తనాలు యొక్క నూనె సప్లిమెంట్లు ఇచ్చారు . అప్పుడు వారిలోడయాస్టోలిక్ రక్తపోటును 7 శాతం తగ్గించాయని, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వుల స్థాయిలను 16% పెంచాయని నిపుణులు కనుగొన్నారు.
మధుమేహం ఉన్నవారు ఈ గింజలను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిని గింజల రూపంలో లేదా పొడి రూపంలో తీసుకున్న రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది అని పరిశోధనలు పేర్కొన్నాయి.ఆరోగ్యంగా ఉన్న కొంతమంది వ్యక్తులపై నిర్వహించిన ప్రకారం 65 గ్రాముల గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా చేర్చారు తిన్న తర్వాత వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉన్నాయని తేలింది
Face Pack : మెరిసే చర్మం కోసం నాచురల్ పేస్ ప్యాక్ ..ఇప్పుడు మీ కోసం..
నిద్రలేమి సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. వీటిలో ట్రిప్టో ఫోన్ సహజంగానే ఉంటాయి. ఇవి నిద్ర రావడానికి తోడ్పడే అమైనో ఆమ్లం. రోజుకు కనీసం ఒక గ్రామ్ తీసుకోవడం వల్ల నిద్ర రావడానికి అవకాశం ఉంటుందని పరిశోధనలు పేర్కొన్నాయి. నిద్రలేమితో బాధపడే వారు వాడి దీని ఉపయోగాలను పొందారు అని గుర్తించబడింది.కాబట్టి గుమ్మడి గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పారవేయకుండా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.