Telugu Mirror : మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఖనిజాలు అవసరం. వాటిలో జింక్ ఒకటి. జింక్ లోపిస్తే రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. శరీరంలోని జీవక్రియలను మరింత మెరుగ్గా పనిచేయడానికి, పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి .మానవ శరీరానికి ప్రోటీన్, ఐరన్ ఎంత అవసరమో కొన్ని ఖనిజాలు కూడా అంతే అవసరం. అటువంటి ఖనిజాలలో జింక్ ఒకటి.మినరల్స్ శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అయినప్పటికీ వీటి పాత్ర చాలా ముఖ్యమైనది.
Nothing Phone(2) : భారత్ లోకి భారీ అంచనాల నడుమ నథింగ్ ఫోన్ (2)..
మనం తీసుకునే ఆహారంలో జింక్ లోపించినట్లయితే దేహంలో కొన్ని అంతర్గత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా ఆహార పదార్థాలలో లభించే జింక్ ను సులభంగా తీసుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇవి ఎందుకు అవసరమో ,వీటివల్ల ఉపయోగాలు, వీటి లోపం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం.
జింక్ వల్ల ఉపయోగాలు:
వైరస్ మరియు బ్యాక్టీరియాలతో పోరాటం చేయడానికి, మరియు శరీరం దృఢమైన రోగనిరోధకశక్తిని నిర్మించడంలో జింక్ సహాయపడుతుంది. గాయాలను త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది . ఘ్రాణశక్తి సక్రమంగా పనిచేయడానికి, మరియు రుచిని తెలియజేయడానికి, పిల్లల ఎదుగుదలకి, ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
జింక్ లోపం:
జింక్ లోపం ఉన్నవారు మిగతా వారి కన్నా త్వరగా అంటు వ్యాధులకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. నాన్ వెజ్ తినని వారిలో జింక్ లోపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జింక్ లోపం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. సాధారణంగా మగవారికి 11 మిల్లి గ్రాములు, ఆడవారికి ఎనిమిది మిల్లి గ్రాముల జింక్ అవసరం అవుతుంది.గర్భిణీ స్త్రీలకు మరియు ప్రసవానంతరం పాలిచ్చే తల్లులకు జింక్ అవసరం ఎక్కువగా ఉంటుంది.పేగు శస్త్ర చికిత్స, మద్యం సేవించడం, పెద్ద పేగు అల్సర్ వంటి జీర్ణ వ్యాధి సమస్యలు ఉన్నవారికి జింక్ లోపం ఉన్నట్లయితే ,ఇవి తొందరగా నయం అవడం కష్టతరం అవుతుంది.
60 రోజులు సముద్రంలో చిక్కుకున్న సెయిలర్..తోడుగా కుక్క మాత్రమే..
ఏ ఆహారం ద్వారా జింక్ లభిస్తుంది:
మాంసాహారంలో జింక్ ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల జింక్ ను సులభంగా పొందవచ్చు అని పరిశోధకులు కనుగొన్నారు.
ఒకవేళ మీరు శాఖాహారులైతే మీరు తీసుకునే రోజువారి ఆహారంలో పప్పులు, గుమ్మడికాయ – పుచ్చకాయ గింజలు, బీన్స్ , ఓట్స్, జీడిపప్పు మొదలైన వాటిని తినడం ద్వారా మీ శరీరానికి జింక్ అందించవచ్చు.కాబట్టి ఖనిజాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. వీటి ఉపయోగం శరీరానికి చాలా ఉంది. అందువలన ప్రతి ఒక్కరు తగిన మోతాదులో జింక్ ను ఆహారం ద్వారా శరీరానికి అందించాలి.