Telugu Mirror : వర్షాకాలం మొదలైంది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటువ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దేశంలో రుతుపవనాలు ప్రారంభమయ్యాయి దీనితో వానలు మొదలయ్యాయి కొన్ని రోజులు వానలు మరికొన్ని రోజులు ఎండలు ఇటువంటి వాతావరణం ఉష్ణోగ్రతల్లో తరచూ మార్పులు రావడంతో అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వానాకాలంలో ప్రజలందరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Fixed Deposite : మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు ?
నిర్లక్ష్యం చేస్తే అనేక రకాల రోగాలకు గురి అయ్యే అవకాశం ఉంది. వర్షాకాలంలో మనం ఎక్కువగా రెండు రకాల వ్యాధులు చూస్తుంటాం. మొదటిది కలుషితమైన ఆహారం – నీరు వలన, రెండు దోమల ద్వారా వచ్చే వ్యాధులు. ఈ రెండు పరిస్థితులు అనేక సందర్భాల్లో మీ ఆరోగ్య సమస్యలను ఎక్కువ చేస్తాయి కాబట్టి, ప్రజలందరూ ఇలాంటి వ్యాధులు పట్ల చాలా అప్రమత్తంగా ఉండి తమను తాము కాపాడుకోవాలి.
వైద్యుల సలహాలు :
ఆరోగ్య రంగ నిపుణులు ఏమని అంటున్నారంటే, వాతావరణంలో తేమ ఉండటం మరియు వర్షం వల్ల కలిగే మురికి అలాగే ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా ఈ కాలం ఎక్కువ వ్యాధులు వృద్ధికి అత్యంత అనుకూలమైన కాలం. వైరస్ బ్యాక్టీరియా ల కారణంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు అనగా ఆహారం కలుషితం కావడం, కడుపులో ఇన్ఫెక్షన్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
దోమల వల్ల వచ్చే రోగాలు:
వర్షాలు కారణంగా నీరు నిలిచి దోమలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ దోమలు ప్రజలను కుట్టడం వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి సంవత్సరం వేల మంది ప్రజలు ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. గుంటల్లో పాత టైర్లలో, పాత కూలర్లు, మురికి కాలువలలో నీరు నిలిచి ఉండడం వల్ల అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. దీని కారణంగా దోమలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ కాలంలో డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా వ్యాధులు ఎక్కువగా వస్తాయి.
పగటిపూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ(Dengue) వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వేళ కుట్టే దోమల వలన మలేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. అనగా శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు, దోమతెరలు మొదలైన జాగ్రత్తలు తీసుకోవాలి.
కలుషితమైన నీరు – ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు:
వానా కాలంలో ఆహారం పట్ల చాలా పరిశుభ్రత పాటించాలి. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఇబ్బందికి లోనవుతుంది. అప్పుడు వ్యాధులు ప్రమాదం ఎక్కువ అవుతుంది. వర్షాకాలంలో త్రాగే నీరు పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. కలుషితమైన నీరు త్రాగడం వలన టైఫాయిడ్(Typhoid) వచ్చే అవకాశం ఉంది.
MegaStar Chiranjeevi : తెలుగు సినిమా చరిత్రలో చెరగని చిహ్నం..
టైఫాయిడ్ వ్యాధి యొక్క లక్షణాలు :
విపరీతమైన తలనొప్పి, చమట, ఒళ్ళు నొప్పులు మరియు కడుపు నొప్పితో పాటు జ్వరం వస్తుంది. సరిగ్గా ఉడకని మరియు పాడైపోయిన ఆహారాన్ని తీసుకోవడం వలన మరియు కలుషితమైన నీరు త్రాగడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ తో పాటు వాంతులు , విరోచనాలు(Motions) పొట్టలో ఇన్ఫెక్షన్ లాంటి రోగాలు కూడా వస్తాయి.
వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం:
వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారము, త్రాగే నీరు విషయంలో పరిశుభ్రత పాటించాలి. బాగా కడిగిన తర్వాతే పండ్లు మరియు కూరగాయలను తినాలి. సరిగా ఉడకని మరియు నిల్వ ఉన్న ఆహారాన్ని అసలు తినకూడదు, ఇది చాలా ప్రమాదకరం. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించడం వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.