Telugu Mirror: వర్షాకాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనపడుతుంది . కానీ దానితో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుంది . చర్మం(skin) మరియు జుట్టు సమస్యలని కూడా కలిగిస్తుంది . కావున ఈ కాలం లో ప్రత్యేక శ్రద్ధ , జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం . ఈ సమస్యలను నియంత్రించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
ఇన్ఫెక్షన్ రాకుండా ముందు జాగ్రత్త :
వర్షాకాలం లో చర్మం పై దద్దుర్లు , దురద ఎల్లప్పుడూ తోడుగా ఉంటూనే ఉంటాయి. జుట్టు రాలిపోవడం వల్ల కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి . అయితే వీటిని అదుపులో ఉంచేందుకు ప్రముఖ చర్మవ్యాధి డాక్టర్ జయశ్రీ శరద్(jaya sri sharadh) ఇన్ స్టాగ్రామ్ లో ప్రసావించారు. వారు చెప్పిన 5 చిట్కాలతో మీ చర్మ సమస్యలు మరియు జట్టు రాలడం అదుపులో ఉంటాయి . Dr . శరద్ ప్రకారం వానాకాలం లో జుట్టుని కట్టుకోడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది .
స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది . జుట్టు తడిగా ఉంటే తలకు నీరు పట్టి సమస్య పెరిగే అవకాశం ఉంది . ఈ సమయం లో జుట్టు ముడిపడి ఉంటే ప్రమాదం ఇంకా ఎక్కువ అవుతుంది . ఉదాహరణకు, శిలీంధ్రాలు, ఈస్ట్‌లు, బ్యాక్టీరియా(bacteria)లు నెత్తిమీద గూడు కట్టుకుని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ కు దారి తీస్తుంది. తద్వారా తలలో పేలు కూడా వస్తాయని డాక్టర్ చెబుతున్నారు .
తడి బట్టల్తో ఎక్కువ సేపు ఉండకూడదు అలా చేస్తే చర్మ సమస్యలకు తెస్తుంది. ఎక్కువ సమయం తడి బట్టల మీద ఉంటె ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. వీలు అయినంత త్వరగా తడి బట్టలను మార్చుకుకోండి. Dr .శరద్ గారు ఈ సమయం లో లైట్ మేకప్ ని ప్రిఫర్ చేయమని చెప్తున్నారు . ఎక్కువ మేకప్ చర్మం పై పూతను ఏర్పరుస్తుంది . అందువల్ల ఆక్సిజన్ సరిగా పొందలేకపోవచ్చు . ఇంకోపైపు గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల చెమటలు పట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది . దేహాన్ని పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి .
యంటీ ఫంగల్ పొడి ని చంకలో , ఛాతి కింద భాగం లో మరియు ముడతలు ఉన్న చోట అప్లై చేసుకోండి , సన్ స్క్రీన్ని వినియోగించండి . ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది . పొగమంచు ఉన్న రోజుల్లో సన్‌స్క్రీన్(sun screen)ని సిఫార్సు చేస్తున్నారు Dr . శరద్ గారు . వానకాల సమయం లో డెనిమ్ ప్యాంట్లు కాకుండా త్వరగా ఆరిపోయే కాటన్ లేదా కాటన్ డ్రై ప్యాంటు ధరించండం ఉత్తమం. ఇవి స్కిన్ డామేజ్ ను తగ్గిస్తుంది .