Telugu Mirror : ఫేస్ ప్యాక్ లు అప్లై చేయడం వల్ల ముఖంపై మరియు చర్మం పై మెరుపును తీసుకువస్తాయి .ఇవి అమ్మాయిలు మరియు అబ్బాయిల చర్మం పై కూడా పనిచేస్తాయి .అప్పుడప్పుడు ముఖం మరియు చర్మం రంగును కోల్పోతుంది. అటువంటి సమయంలో ఇలాంటి ఫేస్ ప్యాక్ లు వాడడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. వాతావరణం లో ఉండే మార్పుల వలన అనగా కాలుష్యం ,చెమటలు కారణంగా మనకు చర్మంపై అనేక రకాల సమస్యలు కనిపిస్తుంటాయి .అటువంటి అప్పుడు మహిళలు తమ చర్మాన్ని రక్షించుకోవడం కోసం మార్కెట్ లో దొరికే అనేక ప్రోడక్ట్స్ వాడుతుంటారు లేదా పార్లర్ కు వెళుతుంటారు. పురుషులైతే చర్మ సంరక్షణపై ఎలాంటి శ్రద్ధ వహించరు.
స్త్రీలు అయినా పురుషులు అయినా మెరిసే చర్మం పొందాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని ఫేస్ ప్యాక్ లను తెలుసుకుందాం. దీనికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదు. ఈ ఫేస్ ప్యాక్ లను అప్లై చేయడం వల్ల స్కిన్ కాంతివంతంగా మారుతుంది.
1. శెనగపిండి,గంధం,పాలు మరియు పసుపుతో కూడిన ఫేస్ ప్యాక్:
రెండు స్పూన్ల సెనగపిండిలో కొద్దిగా గంధం పొడి చిటికెడు ఆర్గానిక్ పసుపు మరియు కొద్దిగా పాలు పోసి కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను ముఖంపై మరియు చర్మంపై అప్లై చేసి రెండు గంటలు తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది.
2. మసూర్ దాల్ ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయాలంటే ముందుగా పప్పుని పేస్ట్ లాగా చేయాలి .ఆ తర్వాత ఈ పేస్ట్ కి కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి.ఆరిన తర్వాత నీటితో కడగాలి, దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
3. టమాటో ప్యాక్:
టమాటో పేస్ట్ ని ఫేస్ మరియు స్కిన్ పై అప్లై చేయడం వల్ల ట్యాన్ తగ్గుతుంది .టమాటో రసంలో పంచదార వేసి దీన్ని ముఖానికి పట్టించాలి .ఒక అరగంట తర్వాత నీటితో కడగాలి. ఈ ప్యాక్ వాడటం వల్ల కొన్ని రోజుల్లోనే మీముఖంలో మెరుపు కనిపించడం మొదలవుతుంది.
4. పెరుగు మరియు పసుపు ఫేస్ ప్యాక్:
రెండు స్పూన్ల పెరుగులో చిటికెడు ఆర్గానిక్ పసుపు కలిపి కళ్ళకు దూరంగా ఫేస్ కి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
5. బొప్పాయి ఫేస్ ప్యాక్:
బొప్పాయి ఆరోగ్యానికి మరియు చర్మ రక్షణకు కూడా వాడుకోవచ్చు. ఈ ప్యాక్ కోసం బొప్పాయి పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుంటే చాలు. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.
6. బంగాళదుంప ఫేస్ ప్యాక్:
బంగాళదుంపను ఫేస్ కి అప్లై చేయడం వల్ల టాన్ తగ్గుతుంది. బంగాళదుంపను రౌండ్ గా కట్ చేసి ఫేస్ పై రుద్దడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు మరియు టాన్ తగ్గుతాయి.ఇటువంటి కొన్ని ఫేస్ ప్యాక్ లు మనం ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటే ముఖం మరియుచర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసిన తర్వాత కొన్ని గంటల వరకు సోప్ వాడకూడదు.