స్త్రీల ను ఇబ్బంది పెట్టే సమస్యలలో వైట్ డిశ్చార్జ్ (White discharge) ఒకటి. ఈ సమస్యను చాలా మంది మహిళలు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. అయితే ఈ సమస్య ఉన్నవారు సిగ్గు (shame) తో చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడని వారు ఉంటారు.
కానీ ఈ సమస్య వచ్చినప్పుడు అశ్రద్ధ చేస్తే, ఆ తర్వాత దీర్ఘకాలికంగా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. వైట్ డిశ్చార్జ్ మరియు UTI లో మంట, నొప్పి ఇటువంటి సమస్యలతో మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని నుండి బయటపడడానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.
Also Read : శరీరానికి పోషకాలే కాదు ‘చర్మ సమస్యలను సైతం ఖతం’ చేసే పాలకూర.. అందుకే ఇది సూపర్ ఫుడ్
బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవారు మరియు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని వారు వీటిని త్రాగడం వలన చాలా బాగా సహాయ పడతాయి. వైట్ డిశ్చార్జ్ సమస్య ను తగ్గించడంలో రైస్ వాటర్ (Rise Water) బాగా సహాయ పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రైస్ వాటర్ ను ఎలా తయారు చేయాలో మరియు ఈ వాటర్ తాగడం వల్ల ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
రైస్ వాటర్ తయారు చేసే విధానం :
ఒక కప్పు బియ్యం తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక్కసారి మాత్రమే కడగాలి. ఆ తరువాత రెండు లేదా మూడు కప్పుల నీటిని బియ్యంలో పోసి, రెండు నుంచి మూడు గంటల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత బియ్యపు నీటిని వడకట్టి త్రాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల త్రాగడం వలన వైట్ డిశ్చార్జ్ సమస్య తొలగిపోతుంది.
రైస్ వాటర్ కు చలువ చేసే గుణం ఉంటుంది. స్త్రీలు ఈ బియ్యం నీటిని త్రాగడం వలన మూత్రం (urine) లో చికాకు, రక్త స్రావం అధికంగా అవ్వడం, విరోచనాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది.
రైస్ వాటర్ చర్మానికి మరియు జుట్టుకు ఏ విధంగా ఉపయోగ పడతాయో తెలుసుకుందాం.
రైస్ వాటర్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంను కాంతివంతంగా మరియు తేమ (humidity) గా ఉంచుతుంది.పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడేవారు రైస్ వాటర్ ను ప్రతిరోజు అప్లై చేయడం వలన పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.
రైస్ వాటర్ ను జుట్టు (Hair) కు అప్లై చేసి ఒక గంట పాటు అలానే ఉంచి, తర్వాత మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు బలంగా, దృఢంగా షైనీ గా మారుతుంది.
Also Read : Health Tips : స్వంతంగా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ముఖ్యంగా పారాసెటమాల్ అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే
కాబట్టి వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నవారు రైస్ వాటర్ ని త్రాగడం వలన ఈ సమస్య నుండి సురక్షితం (safe) గా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ రైస్ వాటర్ జుట్టు మరియు చర్మ సమస్యలకు, పరిష్కారంగా కూడా చాలా బాగా సహాయపడతాయి.
గమనిక :
ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడింది. వీటిని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించగలరు.