ఆహార పదార్థాలను కొనుగోలు చేసినప్పుడు న్యూస్ పేపర్ లో పెట్టి ఇస్తుంటారు వ్యాపారస్తులు. ఆహార పదార్థాలు ప్యాక్ చేయడానికి వార్తాపత్రికల (Newspapers) ను ఉపయోగించ వద్దని వ్యాపారస్తులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరింది. న్యూస్ పేపర్ లో ఆహార పదార్థాలను పెట్టి విక్రయించే విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరికలను విడుదల చేసింది. న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన మరియు నిలువ చేసిన ఆహార పదార్థాలను తినొద్దని వినియోగదారులను సూచించింది. న్యూస్ పేపర్ లో ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని హెచ్చరించింది.
ఈ విషయం పై నిబంధనలను (Rules) పరిశీలించి కఠినంగా అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో పని చేయనున్నట్లు ప్రకటనలో తెలపడం జరిగింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈవో జీ కమలవర్ధనరావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వినియోగదారులు, ఆహారాన్ని విక్రయించే వారు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి మరియు నిల్వ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించడాన్ని వెంటనే ఆపివేయాలని కోరారు.
Also Read : world Heart Day : మీ హృదయం మీ చేతిలోనే పదిలం. సక్రమమైన జీవన శైలితోనే అది సాధ్యం
వార్తాపత్రికల్లో ఉపయోగించే ఇంకులో ఎన్నో బయో ఆక్టివ్ (Bio Active) మెటీరియల్ ఉంటాయని ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయని చెబుతున్నారు ఇలా కలుషితమైన ఆహారం తినడం వల్ల కాలక్రమేణా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని ఎఫ్ ఎస్ ఏ ఐ బుధవారం సెప్టెంబర్ 27న హెచ్చరించారు ఇదే కాకుండా ప్రింటింగ్ చేయడానికి ఉపయోగించే ఇంక్ లో సీసం, లెడ్ వంటి భారమైన లోహాలతో హాని కలిగించే రసాయనాలు (Chemicals) ఉంటాయని ఇవి ఆహారంలో కలిసిపోవడం వల్ల కాలం గడిచే గడిచే కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. తద్వారా వైరస్, బ్యాక్టీరియా ఇతర వ్యాధికారక క్రిములు (Pathogens) పేపర్లకు అంటుకొని ఉంటాయి. అటువంటి పేపర్లలో ఆహారం తినడం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఎఫ్ ఎస్ ఏ ఐ తెలిపింది.
న్యూస్ పేపర్ లో లో ఫుడ్ ప్యాకింగ్ మరియు నిల్వ చేయడానికి వినియోగించకుండా నిషేధిస్తూ (Forbidden) 2018 లోనే నిబంధనలను ఇచ్చింది. నిబంధనల ప్రకారం, వార్తాపత్రికలలో ఆహార పదార్థాలు ప్యాక్ చేయడం, వేయించిన ఆహారాలను అందులో ఉంచి తినడం, నూనె ఎక్కువగా పీల్చుకున్న (inhaled) ఆహార పదార్థాలను న్యూస్ పేపర్ సాయంతో తొలగించడం లాంటివి చేయకూడదని ఎఫ్ ఎస్ సి ఐ తెలిపింది. ఆహార పదార్థాలను విక్రయించే వారు ఎవరైనా ఈ విధంగా చేస్తే చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు.
Also Read : విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం
వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టప్రకారం అనుమతించిన మెటీరియల్ లోనే ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయాలని ఎఫ్ ఎస్ ఏ ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధనరావు కోరారు. కాబట్టి న్యూస్ పేపర్లను ఫుడ్ ప్యాకింగ్ కు ఉపయోగించడానికి వెంటనే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వినియోగదారులు (Users) మరియు ఆహారాన్ని విక్రయించే వారిని ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది.