Telugu Mirror: బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ(Telangana)లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) సహా రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి.ఈ నేపధ్యంలో వాగులు-వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది సైతం వరద ఉధృతిని ఎదుర్కుంటున్నది.
Also Read:Rainy-Season : వానాకాలం.. వ్యాధుల కాలం.. చెక్ పెట్టండి ఇలా..
రాష్ట్రంలో ఇంకా రెండు రోజులపాటు ఇదే విధమైన పరిస్థితులు ఉండనున్నాయని,భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.అటు ఉత్తర తెలంగాణలో అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలలో భారీగా వర్ష పాతం నమోదు అవుతుందని వారావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలలో ఇప్పటికే వర్షాల ఉధృతికి అతలాకుతలం అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరికల నేపథ్యంలో ఇంకా వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అప్రమత్తమైనది.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ లోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో ఈ నెల 26,27 తేదీలలో,అంటే బుధ,గురు వారాలలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. సెలవులకు సంభంధించిన ఉత్తర్వులను తక్షణమే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indhira reddy)ని CM KCR ఆదేశించారు.రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 20,21,22 తారీఖులలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణంగా మరోసారి విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
Also Read:60 రోజులు సముద్రంలో చిక్కుకున్న సెయిలర్..తోడుగా కుక్క మాత్రమే..
జంట నగరాల తోపాటు మేడ్చల్,మల్కాజిగిరి,రంగారెడ్డి,
సంగారెడ్డి,రాజన్నసిరిసిల్ల,సిద్దిపేట,యాదాద్రి భువనగిరి, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్, మరియు ఆదిలాబాదు జిల్లాలలో
ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.హైదరాబాద్ తో పాటు మొత్తం 8జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను సైతం విడుదల చేసింది.
పెద్దపల్లి,కరీంనగర్,నల్గొండ,వరంగల్,సూర్యాపేట,వికారాబాద్,మహబూబాబాద్,యాదాద్రి,ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ను విడుదల చేసింది వాతావరణ శాఖ కేంద్రం.ఈ పరిస్థితుల నేపధ్యంలో లోతట్టు ప్రాంతం లోని ప్రజలను అప్రమత్తం చేసినారు.అలాగే నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్త వహించాలి అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం మరియు జిల్లాల అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నారు.