Categories: Automobile

XMR 210 : హీరో కరిజ్మా మళ్లీ వచ్చింది! కొత్త XMR 210 యొక్క స్పోర్టీ డిజైన్..

Telugu Mirror : హీరో మోటొ కార్ప్(Moto Corp) తన నూతన కరిజ్మా XMR 210 బైక్ విడుదలకు సన్నద్దం అవుతుంది.విడుదలకు ముందే బైక్ కు సంభంధించిన లీక్(Leak) లు చాలా వచ్చాయి.అయితే బైక్ రిలీజ్ కు సంభంధించి కంపెనీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ,హీరో మోటొ కార్ప్ ఇండియా విడుదల చేసిన టీజర్(Teaser) వీడియో,కంపెనీ నుండి త్వరలో కొత్త ఉత్పత్తి ని ప్రారంభానికి సూచికలాగా ఉంది.ఈ టీజర్ ని అనుసరించి కొత్త ఉత్పత్తి కరిజ్మా XMR 210 అని భావిస్తున్నారు.

Dazzler Eyes : చిన్న కళ్ళ కోసం పెద్ద టిప్స్ .. ఇక అందరి చూపు ఇప్పుడు మీ వైపు..

హీరో మోటొ విడుదల చేసిన టీజర్ లో కంపెనీ రిలీజ్(Release) చేసే ఉత్పత్తి పేరును వెల్లడించనప్పటికీ,దాని విడుదల తేదీని మాత్రం ప్రకటించారు.కనుక హీరో మోటొ కొత్త కరిజ్మా XMR 210 బైక్ ని 29 ఆగస్ట్ 2023 న మార్కెట్ లోకి లాంఛ్ చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.గతంలో భారత దేశంలోని డీలర్ షిప్ లో, లాంఛ్ అవుతున్న మోటార్ సైకిల్(Motor Cycle) యొక్క ప్రొడక్షన్,అలాగే తయారైన మోడల్,లీకైన చిత్రాలలో మోటార్ సైకిల్ ను చూడటం జరిగింది.

Image Credit : gaadi start

లీకైన చిత్రాల ద్వారా మోటార్ సైకిల్ యొక్క ఆగ్రెసివ్ డిజైన్(Aggressive Design) వెల్లడి అయింది.కనిపించిన చిత్రంలో చిసెల్డ్ ఫ్రంట్ ఎండ్,షార్ప్ సైడ్ ప్యానెల్స్, కండరాల లాంటి లుక్ తో ఫ్యూయల్ టాంక్ మరియు స్ప్లిట్-స్టైల్ సీటు ఉన్నాయి.లీకైన నివేదికలను అనుసరించి,ఈ బైక్ పూర్తి LED లైటింగ్ మరియు బ్లూ టూత్ తో సెటప్ చేయబడిన డిజిటల్ ఇన్ స్ట్రు మెంట్ క్లస్టర్ కూడా ఉండవచ్చు.

Kitchen tips: మాడిపోయిన పాత్రలకు తల తల మెరిసే సూత్రాలు..

న్యూ 210cc లిక్విడ్-కూల్డ్,సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది.ఇది గరిష్టంగా 25bhp ( బ్రేక్ హార్స్ పవర్) శక్తిని విడుదల చేయగలదు.సిక్స్ స్పీడ్ ట్రాన్స్ మిషన్(Speed Trans Mission) తో కలసి ఉంటుంది అని అంచనా.దీనిలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ లు,వెనుక వైపు మోనో షాక్,ఫ్రంట్ మరియు బ్యాక్ డిస్క్ బ్రేక్(Back Disc Brakes) లు అలాగే డ్యూయల్ – ఛానల్ ABS సిస్టమ్ కలిగి ఉంటుంది.బజాజ్ పల్సర్ F250,సుజుకి Gixxer SF250 మరియు యమహా YZF – R15 లకు పోటీగా కరిజ్మా XMR 210 నిలుస్తుందని భావిస్తున్నారు.

Telugu Mirror

Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in

Share
Published by
Telugu Mirror

Recent Posts

ವಿಕ್ರಂ ಗೌಡ ನಕ್ಸಲ್ ನಿಗ್ರಹ ಪಡೆ ಪೊಲೀಸರ ಬಲೆಗೆ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಬಿದ್ದಿದ್ಹೇಗೆ

ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್​ಎಫ್​ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್​​ಕೌಂಟರ್​…

1 month ago

make sure working

ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್​, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್‌ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…

1 month ago

Aadhaar Update : ఆధార్ కార్డు నవీకరణకు మరో అవకాశం.. ఏపీలో ప్రత్యేక డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే?

[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…

5 months ago

Microsoft Windows crashes : మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు.

[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…

5 months ago

Samsung Galaxy M35 5G : శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌.

Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…

5 months ago

Honor 200 5G Series : అదరగొట్టిన హానర్.. టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్.. ధర ఎంతో తెలుసా?

Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…

5 months ago