High Earning Crop Types: వరి పండిస్తున్నారా? అయితే, అధిక దిగుబడి ఇచ్చే సన్న వరి రకాలు ఇవే!
వరి పడించడంలో సన్న వరి చాలా రకాలుగా ఉంటుంది. అయితే, అధిక దిగుబడిని ఇచ్చే సన్నవరి రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
High Earning Crop Types: తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే పంటల్లో వరి ఒకటి. వరి పండిస్తే ఎకరాకు రూ.500 బోనస్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, వరి పడించడంలో సన్న వరి చాలా రకాలుగా ఉంటుంది. అయితే, అధిక దిగుబడిని ఇచ్చే సన్నవరి రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంటీయూ – 1262 విత్తనం :
ఈ విత్తనాలు ఉపయోగిస్తే రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ విత్తనాలు తెలుపు రంగులో ఉంటాయి. వీటి కాండం ధృడంగా ఉంటుంది. దీంతో, గాలివానలు వచ్చిన కూడా తట్టుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. దోమ, ఎండాకు తెగులు నుండి తట్టుకుంటుంది. ఖరీఫ్ మరియు రబీ సీజన్ లో గింజ ఎక్కువ రాలదు. ఈ గింజ ఎలా ఉంటుంది అంటే బీపీటీ-5204 లాగ ఉంటుంది. వర్షాకాలంలో దిగుబడి 35 క్వింటాల వరకు ఉంటుంది. అదే ఎండాకాలంలో అయితే, 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఎకరాకు 25కేజీల నారు పోస్తే సరిపోతుంది. ఈ విత్తనం 150 రోజుల నుండి 155 రోజుల కాలం ఉంటుంది.
ఎంటీయూ -1318 విత్తనం :
ఈ రకం విత్తనం ఖరీఫ్ పంటకు అనువైనదిగా ఉంటుంది. ఈ విత్తనాలు ఎరుపు రంగులో ఉంటాయి. అగ్గి తెగులు, దోమ, ఎండాకు, మొగి పురుగు ను తట్టుకునే గుణం ఉంటుంది. అయితే, ఇది మధ్యస్థ సన్నవరి రకము. గింజ ఎక్కువగా రాలేదు అలాగే నూక కూడా తక్కువ శాతం ఉంటుంది. దీనికి నైట్రోజెన్ కూడా తక్కువగా అవసరం అవుతుంది. దిగుబడి విషయానికి వస్తే ఎకరాకు దాదాపు 40 క్వింటాలు ఇస్తుంది. దీనికి పంట కాలం 150 రోజులు ఉంటుంది.
Also Read:Runamafi update : సర్వం సిద్ధం, రుణమాఫీపై త్వరలోనే ప్రకటన
కేఎన్ఎం – 1638 విత్తనం :
ఈ విత్తనం బీపీటీ- 5204ని పోలి ఉంటుంది. ఇది దోమ, ఉల్లి కొడు, అగ్గి తెగలును కొంత వరకు తట్టుకుంటుంది. ఇక దిగుబడి విషయానికి వచ్చేసారి ఎకరాకు 28 నుండి 30 క్వింటాలు ఉంటుంది. ఇకపోతే, ఈ విత్తనం ఖరీఫ్ మరియు రబీ సీజన్ లో పండించుకోవచ్చు. ఇది ఎక్కువ ఎత్తు ఎదగదు కాబట్టి గాలివానలు వచ్చిన కూడా కింద పడదు. నైట్రోజన్ అవసరం ఉన్నంత వరకు వేసుకోవాల్సి ఉంటుంది. దీని పంట కాలం 120 నుండి 125 రోజుల వరకు ఉంటుంది.
బీపీటీ-3082 విత్తనం :
ఇది సన్నగింజ రకం. ఖరీఫ్ మరియు రబీ సీజన్ లో పండించుకోవచ్చు. అగ్గి తెగులు, సుడిదోమ కొంత వరకు తట్టుకుంటుంది. ఈ విత్తనానికి ఎరువులు తక్కువగా అవసరం అవుతాయి. ఇది అన్ని రకాల నేలల్లో సాగు చేయొచ్చు. నైట్రోజన్ ఎక్కువగా వాడకూడదు. ఇక దిగుబడి చూసుకుంటే 35 క్వింటాలకు పైనే వస్తుంది. ఈ విత్తనం దాదాపు 130 నుండి 135 రోజుల పంట కాలం ఉంటుంది.
Comments are closed.