జీవితంలో ఎప్పటికైనా అందమైన స్వంత ఇంటిని కలిగి ఉండటం ప్రతి ఒక్కరి కల మరియు ఈ కలను ముందుగానే తీర్చుకోవడానికి, చాలా మంది గృహ రుణం (Home Loan) తీసుకుంటారు. మీరు కూడా ఈ సంవత్సరం చివరి నాటికి ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లైతే మీరు తప్పనిసరిగా గృహ రుణాలపై బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చాలి.
వివిధ బ్యాంకులు ప్రత్యేక తగ్గింపు (Special discount) ఆఫర్లను ప్రారంభించాయి. మేము మీ కోసం కొన్ని గృహ రుణాల డీల్‌లను లిస్ట్ చేశాము.
బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఈస్టివ్ ఆఫర్
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) పండుగ ప్రారంభానికి ముందే తన కస్టమర్ల కోసం ‘BOB కే సాంగ్ ఫెస్టివల్ కి ఉమంగ్’ అనే ప్రచారాన్ని (campaign) మొదలుపెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలు పెట్టిన ఈ స్పెషల్ ప్రచారం 31 డిసెంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రచారం కింద, బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో హౌస్ లోన్స్ , పర్సనల్ లోన్స్ , కారు రుణాలు అలాగే విద్యా రుణాల (Education loans) ను అందిస్తోంది.
SBI హోమ్ లోన్ వడ్డీ రేటు
0.17 శాతం తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో సంవత్సరానికి 8.40 శాతం చొప్పున ప్రస్తుతం, SBI గృహ రుణాలను ఇస్తోంది. SBI హోమ్ లోన్ లపై 65 బేసిస్ పాయింట్లు అంటే 0.65 శాతం తగ్గింపును అందిస్తుంది. కస్టమర్లకు 31 డిసెంబర్ 2023 వరకు ఈ తగ్గింపు సాధారణ హోమ్ లోన్, ఫ్లెక్సీ పే, ఎన్ఆర్ఐగా అందుబాటులో ఉంటుంది. 31 డిసెంబర్ 2023 వరకు ఈ తగ్గింపును పొందవచ్చు.
ఇండియన్ బ్యాంక్ హోమ్ లోన్ రేటు
కస్టమర్ల కు 8.50 నుంచి 9.90 శాతం వడ్డీ రేట్లతో ఇండియన్ బ్యాంక్ గృహ రుణాలను అందిస్తోంది. ఈ ఋణం (loan) మీద ప్రాసెసింగ్ ఛార్జీ మొత్తంలో 0.23 శాతం ఉంటుంది.
ICICI బ్యాంక్ హోమ్ లోన్ రేట్లు
తన వినియోగదారులకు ఇంటి కోసం రుణాలను అందించే కీలకమైన (crucial) ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI బ్యాంక్. CIBIL స్కోర్ 750-800 ఉన్నవారికి ICICI బ్యాంక్ లో గృహ రుణ వడ్డీ రేటు 9 శాతం వరకు ఉంటుంది.