Honda Shine 100: అమ్మకాల్లో అదరగొట్టిన సూపర్ బైక్ ఇదే, ఏకంగా ఒక్క సంవత్సరం లోనే 3 లక్షల బైక్స్ ఖతం.
దేశీయ మార్కెట్ లో హోండా షైన్ 100 ఏకంగా 3 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడైన సందర్భంగా కంపెనీ షైన్ 100 ఫస్ట్ యానివెర్సరీ జరుపుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షైన్ 100 మెగా డెలివరీ ఈవెంట్ నిర్వహించింది.
Honda Shine 100: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కీలక మైలురాయిని సాధించింది. హోండా షైన్-100 (Honda Shine 100) మోటార్‌బైక్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక సంవత్సరంలో మూడు లక్షల యూనిట్లకు పైగా విక్రయించినట్లు పేర్కొంది. ‘హోండా షైన్ 100’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా, అనేక ప్రదేశాలలో మెగా డెలివరీ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన 100-110 సిసి సెక్టార్లో అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. హోండా మోటార్‌సైకిల్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 6000కి పైగా టచ్ పాయింట్లలో హోండా మోటార్ సైకిల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
హోండా షైన్ 100 మోటార్‌బైక్ (Motor Bike) లో కొత్త 100-సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలదు. BS-6 RDE అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఫ్యూయల్ ట్యాంక్ బయట ఫ్యుయల్ పంప్ ఉంటుంది. ఈ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.5 హార్స్పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హోండా షైన్ 100 మోటార్‌సైకిళ్లకు ప్రత్యేక వారంటీ ప్యాకేజీని అందిస్తుంది. మూడేండ్లు స్టాండర్డ్ మరియు మూడేండ్ల ఆప్షనల్ వారంటీ అందిస్తోంది. కాంబి బ్రేక్ సిస్టమ్ (CBS), ఈక్వలైజర్ మరియు 786 mm సీట్ ఎత్తు. షైన్ 100 బైక్, షైన్ 125 మోటార్ సైకిల్ ఐదు రంగులలో అందుబాటులో ఉంది. రెడ్ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, బ్లూ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, గ్రీన్ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, గోల్డ్ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, గ్రే స్ట్రైప్స్ తో పాటు బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
హోండా షైన్ 100 ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో (Indian Market) రూ.64900 గా ఉంది. కంపెనీ అందిస్తున్న ఈ బైక్ 100సీసీ ఓబీడీ2 కంప్లైంట్ పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్ కలిగి స్మార్ట్ పవర్ టెక్నాలజీ (Technology) ని పొందుతుంది. ఇది 7.28 Bhp పవర్ మరియు 8.05 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
Comments are closed.