Honey Bee Effect: మానవులు చేసే పనుల వల్ల పర్యావరణం ఎక్కువగా దెబ్బతింటుంది. ఎన్నో మూగ జీవులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ మార్పు (Climate Change) , అడవుల నరికివేత , రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకం మరియు వాయు కాలుష్యం కారణంగా ఎన్నో జీవులు దెబ్బతింటున్నాయి. మూగ జీవుల సంఖ్య తగ్గిపోతుంది. దాంట్లో ఈ తేనేటీగ (Honeybee) లు ఒకటి. తేనెటీగల జనాభా తగ్గుతోందని ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ నివేదించింది. మానవులు చేసే పనుల వల్ల సీతాకోకచిలుకలు, గబ్బిలాలు మరియు హమ్మింగ్‌బర్డ్‌ల వంటి జీవులకు అపాయం కలుగుతుందని చెప్పారు. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో తేనెటీగలు ఏ పాత్ర పోషిస్తాయి? తేనెటీగలు లేకపోతే ఏమి జరుగుతుంది? అనే విషయం గురించి తెలుసుకుందాం.
తేనెటీగలను ఉపయోగించి ఆహార ఉత్పత్తి:
యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (United Nations Food And Agriculture), ప్రపంచంలోని మొత్తం వ్యవసాయ విస్తీర్ణంలో 35 శాతం లేదా మానవ ఆహార ఉత్పత్తిలో మూడింట ఒక వంతు తేనెటీగలు వంటి జాతులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
పుప్పొడి రేణువులు ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు బదిలీ చేసినప్పుడు పరాగసంపర్కం జరుగుతుంది. ఇది గింజలు మరియు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం, తేనెటీగలు మరియు సీతాకోకచిలుకలు 80 శాతం మొక్కలను పరాగసంపర్కం చేస్తాయి.
Also Read:High Earning Crop Types: వరి పండిస్తున్నారా? అయితే, అధిక దిగుబడి ఇచ్చే సన్న వరి రకాలు ఇవే!
తేనెటీగలు పువ్వు నుండి తేనె (Honey) ను సేకరించేటప్పుడు పుప్పొడి వాటి పాదాలకు అంటుకొని ఉంటాయి మరియు అవి అక్కడ నుండి లేచి సమీపంలోని పువ్వులపై వాలినప్పుడు ఆ తేనేటీగలకి అంటుకున్న ఆ పుప్పొడి రేణువులు పరాగసంపర్కం చెందుతాయి.
అడవులు (Forests) మరియు ఒయాసిస్ వ్యాప్తికి ఇది ప్రధాన కారణం అని చెప్పవచ్చు. తేనెటీగలు మొక్కలకు ప్రయోజనకరంగా ఉంటాయి ఎందుకంటే అవి పుప్పొడిని ఒక పువ్వు నుండి మరొక పుష్పానికి తీసుకువెళతాయి.
“తేనెటీగలు కూరగాయలు మరియు నూనె గింజలు మాత్రమే కాకుండా, బాదం, వాల్‌నట్‌లు, కాఫీ, కోకో బీన్స్, టమోటాలు, యాపిల్స్ మరియు ఇతర పంటలలో కూడా పరాగసంపర్కానికి చాలా అవసరం. ఒకవేళ తేనెటీగలు లేకుంటే మానవ ఆహారంలో పోషకాహార లోపానికి కారణమవుతుందని UN నివేదించింది. దాంతో, తేనెటీగలు తేనె ఉత్పత్తికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆహార సరఫరాకు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.