Bengal Couple : ఆశలు మేడలు కడుతున్నాయి..విలువలు రోడ్డున పడుతున్నాయి..పసిబిడ్డను అమ్మి iphone కొన్న తల్లిదండ్రులు..
Telugu Mirror : సమాజం లో రోజు రోజుకీ విలువలు వెతికినా కనపడని పరిస్థితి లోకి పోతున్నాము.ఈ సమాజం(Society) ఏ వైపు వెళుతుందో కూడా ఊహించలేకుండా ఉన్నాము.తమ సరదాని తీర్చుకోవడం కోసం ఒక జంట తమ ఎనిమిది నెలల పాపను విక్రయించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది.
వివరాల లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ కి చెందిన దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సందర్భంలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్(Instagram Reels) ని తయారు చేయడం కోసం విస్తు పోయే సంఘటనను సృష్టించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వారి నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లా కి చెందిన దంపతులు,ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేయడంకోసం iphone 14 కొనుగోలు చేయడం కోసం ఎనిమిది నెలల తమ బిడ్డను అమ్మివేసినారు.
Today Rashi Phalam: నేటి రాశి ఫలం, డైలీ జాతకం 29-జూలై-2023
కుటుంబం లోని ఎనిమిది నెలల పాప కనిపించని విషయంలో తల్లిదండ్రులలో ఏమాత్రం ఆతృత లేకుండా,ఉదాసీనంగా ఉండటంతో , ఇరుగుపొరుగు వారు గమనించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే గతంలో ఆర్ధిక పరిస్థితి సరిగా లేక ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్ళ దగ్గర రూ.లక్ష లోపులో లభించని iPhone హ్యాండ్ సెట్(iPhone Hand Set) ను కలిగి ఉండటం చూసిన ఇరుగుపొరుగు వారికి అనుమానం కలిగింది.వెంటనే ఇళ్ళ చుట్టుపక్కల వారు పోలీస్ స్టేషన్(Police Station) లో ఫిర్యాదు చేసినారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసి తండ్రి పరారీలో ఉండగా తల్లిని అదుపులోకి తీసుకున్నారు.అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం పర్యటించి పర్యటన వివరాలను ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ తయారు చేయడం కోసం ఐఫోన్ కొనాలనే ఉద్దేశంతో శిశువు(Baby)ను అమ్మివేసినట్లు తల్లి పోలీసు(Police)లకు తెలిపింది.మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో పోలీసులు, శిశువును అమ్మిన తల్లిదండ్రులతో పాటు శిశువును కొనుగోలు చేసిన మహిళపై కూడా కేసు నమోదు చేశారు.
World Hepatitis Day-2023 : “ఒకే జీవితం.. ఒకే కాలేయం”.. అవగాహనతో హెపటైటిస్ ను జయిద్దాం!
దురదృష్టవశాత్తు ఇలా జరగడం ఇదే మొదటి సంఘటన కాదు ఐఫోన్ కొనుగోలు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను అమ్ముకున్న సంఘటనలు ఇతర దేశాలలో కూడా అనేకం జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి.2016లో చైనీస్(Chineese) కు చెందిన దంపతులు తమ 18 రోజుల నవజాత శిశువును ఐఫోన్ కొనడం కోసం $3530 కి అమ్మి వేసినారు.ఆగ్నేయ చైనాలోని పుజియాన్ ఫ్రావిన్సు కు చెందిన డువాన్ అనే పేరు గల తండ్రి తన 18 రోజుల పసికందును అమ్మడానికి సోషల్ మీడియా(Social Media)లోని QQ సైట్(QQ Site) లో కొనుగోలుదారుని కనుగొన్నాడు. కొనుగోలుదారు $3530 (23,000 యువాన్) చెల్లించి శిశువును కొన్నాడు.
ఈ సంవత్సరం ఆస్ట్రేలియా కి చెందిన ఓ మహిళ తనకు పుట్టబోయే బిడ్డను ఐఫోన్ కోసం మార్చుకోవాలని తన కోరికను కోర్టు(Court)లో బయటపెట్టింది. ఆమె తన ఇద్దరు కుమార్తెలను 9 గంటల పాటు కారులో నిర్బంధించి వారి మరణానికి కారణం అయ్యింది. ఆ కేసు విచారణలో భాగంగా కోర్టులో తనకు పుట్టబోయే బిడ్డని ఐఫోన్ కోసం మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది.