Reasons For White Hair : తెల్లజుట్టు వచ్చే ప్రమాదం నుండి కాపాడుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు పాటించి చూడండి.

Telugu Mirror: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొనే సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. అయితే 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిలో జుట్టు రాలే సమస్యతో పాటు, తెల్ల వెంట్రుకల సమస్యలు కూడా అధికమవుతున్నాయి. వైట్ హెయిర్ సమస్య వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణం జీవన విధానంలో మార్పులు మరియు తీసుకొనే ఆహారంలో పోషకాలు లేకపోవడం అలాగే కాలుష్యం (Pollution) తో కూడిన వాతావరణ పరిస్థితులు. వీటివల్ల ఈ సమస్య పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరి ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఈ సమస్యలకు కారణాలు తెలుసుకోవడానికి నిర్వహించిన అధ్యయనం ప్రకారం, రోజువారి భాగంలో ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వలన మరియు వివిధ కారణాల వలన జుట్టు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయని కనుగొన్నారు.

అసలు జుట్టు ఎందుకు తెల్లగా మారుతుందో తెలుసుకుందాం:

తెల్ల జుట్టు రావడానికి కారణం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే, జుట్టు కుదుళ్లలో మెలనిన్ (Melanin) అనే రసాయనాన్ని తయారు చేసే పిగ్మెంట్ కణాలు ఉంటాయి. ఇది మన జుట్టుకు రంగుని ఇస్తుంది. జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల పిగ్మెంట్ కణాలు చనిపోవడం జరుగుతుంది. వర్ణ ద్రవ్యం లేకపోవడం వల్ల కొత్త జుట్టు లేత రంగులో రావడం లేదా ఉన్న జుట్టు తెల్లగా మారడం మొదలవుతుంది. కాబట్టి జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్ల పిగ్మెంట్ల పై చెడు ప్రభావం పడుతుంది.

30 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి జుట్టు తెల్లగా మారినట్లయితే మీరు దానిని నివారించాలి అనుకుంటే మీకున్న చెడుఅలవాట్లను వదిలివేయాలి.

Stress is the main cause to reduce Melanin and hair become to change in white colour
Image Credit: Skin Craft

 

Also Read: Rose Water : ఇంట్లోనే రోజ్ వాటర్ తయారీ, ముఖం క్లీన్, లుక్ ఎవర్ గ్రీన్ కోసం వీటిని తయారు చేసుకోండి. 

ధూమపానం: 

ధూమపానం (Alcohol) అలవాటు ఉన్నవారికి జుట్టు నెరిసిపోయే సమస్య చాలా వేగంగా పెరుగుతుంది. పొగ త్రాగని వారి కంటే ,ఎక్కువగా పొగ త్రాగే వారి జుట్టు గ్రే కలర్ లోకి మారుతుందని పరిశోధనలో పేర్కొన్నారు. తద్వారా జుట్టు బూడిద రంగులోకి మారుతుందని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా సిగరెట్టు పొగలో ఉండే టాక్సిన్స్ శరీరంలోని హార్మోన్ సమతుల్యతను కూడా దెబ్బతీసే అవకాశం అధికంగా ఉంటుంది. దీని వలన జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. తద్వారా జుట్టు తెల్లబడటం మొదలవుతుంది.

అధిక ఒత్తిడి: 

చాలామంది ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలే సమస్య అధికం అవ్వడంతో పాటు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే సమస్య కూడా అధికమవుతుంది. అధికంగా ఒత్తిడి ఉండే వారికి తెల్ల జుట్టు సమస్య పెరుగుతుంది.

అధ్యయనాలు ఏమని చెబుతున్నాయంటే, అధిక ఒత్తిడి వల్ల జుట్టు కలర్ పిగ్మెంట్లకు కూడా హాని కలిగిస్తాయని కనుగొన్నారు .

కాబట్టి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు జీవనశైలి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి .దీంతోపాటు ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. మరియు మానసిక ఒత్తిడి (Mental Stress) లేకుండా చూసుకోవాలి .వీటిని పాటించడం ద్వారా యువతలో ఉన్నవారికి వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించవచ్చు.

Leave A Reply

Your email address will not be published.