Oneplus 10 pro : అద్భుత ఫీచర్లు కలిగిన వన్‌ప్లస్ 10 ప్రో పై భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే..

Telugu Mirror : OnePlus ప్రియులకు శుభవార్త, OnePlus ఫోన్ ల పై ఎప్పుడు డిస్కౌంట్ లభిస్తుందని ఎదురు చూసే వారికి ఈ న్యూస్ బాగా పనికొస్తుంది. అదేవిధంగా OnePlus కంపెనీ యొక్క సక్సెస్ ఫుల్ ఫోన్ లలో ఒకటి అయిన OnePlus 10 Pro మోడల్ పై ప్రస్తుతం డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది.OnePlus 10 Pro రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ఒకటి 8GB + 128GB మోడల్ మరియు మరొకటి 12GB + 256GB.
OnePlus 10 Pro 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన 6.7-inch LTPO QHD+ Fluid AMOLED డిస్ ప్లే తో లభిస్తుంది. అలానే ఈ హ్యాండ్ సెట్ వాల్కనిక్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్ లలో లభిస్తుంది.

కంటే కొడుకునే కనాలి. తగ్గేదే లే అంటున్న ఇండియన్స్

OnePlus 10 Pro ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. 48MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న Sony IMX 789 సెన్సార్ తో 48- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 50- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ మరియు 8- మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో విడుదల అయ్యింది. అలానే 32- మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ హాసెల్ బ్లాడ్ కెమెరా ను కలిగి ఉంది. 150 డిగ్రీల వైడ్ యాంగిల్ ఫోటో లను తియ్యగలదు. నైట్ స్కేప్, అల్ట్రా HDR, స్మార్ట్ సీన్ రికగ్నిషన్, పోర్ట్రైట్ మోడ్, డ్యుయల్ వ్యూ వీడియో మరియు మూవీ మోడ్ వంటి కెమెరా ఫీచర్ లను OnePlus 10 Pro కలిగి ఉంది.

OnePlus 10 Pro 5000mAh బ్యాటరీ ను కలిగి ఉంది. అలానే 80W SUPERVOOC మరియు 50W AIRVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 15 నిమిషాలలో 100% ను చేరుకుంటుందని OnePlus తెలిపింది. ఈ ఫోన్ Type C USB కేబుల్ తో వస్తుంది.
అలానే OnePlus 10 Pro 5G ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Gen 1 అక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 12 మరియు OnePlus యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ Oxygen OS 12 తో నడుస్తుంది.

Samsung Galaxy S21 FE 5G: మొబైల్ మార్కెట్ లో కొత్త Samsung Galaxy S21 FE 5G హవా..వాట్ ఏ ఫోన్? వావ్ అనిపించే ఫీచర్స్

OnePlus 10 Pro 8GB RAM మరియు 128GB వేరియంట్ యొక్క ధర రూ.66,999 అయితే ICICI బ్యాంక్ మరియు OneCard యొక్క క్రెడిట్ కార్డ్ ల పై రూ.5000 తగ్గింపు లభిస్తుంది మరియు 15 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దాంతో రూ.56,999 కు ఈ ఫోన్ లభిస్తుంది. ఈ వేరియంట్ ఎమ్రాల్డ్ ఫారెస్ట్ మరియు వాల్కనిక్ బ్లాక్ కలర్ లలో అందుబాటులో ఉంది. OnePlus 10 Pro 5G 12GB + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క అసలు ధర రూ.71,999, 14 శాతం డిస్కౌంట్ మరియు ICICI బ్యాంక్ మరియు OneCard క్రెడిట్ కార్డ్ ల పై 5000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.61,999 అయితే ఈ వేరియంట్ కేవలం వాల్కనిక్ బ్లాక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in