next flipkart sale 2024 : ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ లో భారీ ఆఫర్స్, సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్13 ఇప్పుడు కేవలం రూ.7,499కే లభ్యం

Huge offers in Flipkart Republic Day sale, Samsung Galaxy F13 now available for just Rs 7,499
image credit: HT Tech

Telugu Mirror : రిపబ్లిక్ డే (Republic Day) దగ్గరికి వస్తున్న సందర్భంగా అనేక ఈ కామర్స్ (Ecommerce) దిగ్గజ సంస్థలు అనేక సేల్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే, అందులో భాగంగానే ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంట్లో వాడే వస్తువులు, ఫ్యాషన్ మరియు ఇతర కేటగిరి వస్తువులు మీద అనేక ఆఫర్లను ప్రవేశపెట్టింది.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెల్ ఫోన్ల డిస్కౌంట్ గురించి ఏకంగా కొన్ని మొబైల్స్ మీద 50% వరకు డిస్కౌంట్ ఉంది, ఈ ఆఫర్లో భాగంగానే సౌత్ కొరియా కి చెందిన మొబైల్ తయారీ సంస్ధ శాంసంగ్ కు చెందిన శాంసంగ్ గెలాక్సీ F13 మొబైల్ (Samsung Galaxy F13 Mobile) మీద కూడా 50% డిస్కౌంట్ లభిస్తుంది, బడ్జెట్ మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ మొబైల్ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు, పూర్తి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం

సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్13 డిస్కౌంట్ లేకుండా రూ.14,999గా ఉంది డిస్కౌంట్ అమలు చేశాక రూ.7,499కి లభిస్తుంది, అంతేకాకుండా మొదటి బ్యాంక్ ఆఫర్ వచ్చేసి శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ కార్డు (Samsung Axis Bank Signature credit card) వాడటం వలన రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది, రెండో బ్యాంక్ ఆఫర్ శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిటీ కార్డు (Samsung Axis Bank Infinite Credit Card) మీద రూ.5, 000 వరకు తగ్గింపు పొందవచ్చు, మూడవ బ్యాంక్ ఆఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) కి సంబంధించింది అదేమిటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ తో 9 నెలలు వరకు EMI ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల 500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ నుంచి కొనడం వల్ల మూడు నెలల వరకు ఫ్రీగా spotify వాడవచ్చు, ఈ ఆఫర్లే కాకుండా మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసే ఆప్షన్ ని ఫ్లిప్కార్ట్ ద్వారా ఉపయోగించుకొని మరింత తగ్గింపును కూడా పొందవచ్చు.

Also Read : Flipkart : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ లో 16 శాతం డిస్కౌంట్ తో ఐఫోన్ 15 మీ సొంతం

ఎంటర్టైన్మెంట్ కోరుకునే మొబైల్ ప్రియులకు Samsung Galaxy F13 మొబైల్ కచ్చితంగా సరిపోతుంది అని చెప్పవచ్చు, సినిమా చూడడానికి, పవర్ ఫుల్ గేమ్స్ ఆడటానికి, ఈ మొబైల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 16.62 సెం.మీ (6.6) FHD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా, ఈ ఫోన్ 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇది ఒక్క ట్యాప్‌తో అద్భుతంగా ఫోటోలని క్యాప్చర్ చేస్తుంది. అంతేకాకుండా, Samsung Galaxy F13 8 GB వరకు RAMని కలిగి ఉంది మరియు దాని పనితీరును మరింత మెరుగు పరచడానికి ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ లో RAM ప్లస్ సాంకేతికతను (ram plus technology) ఉంచారు.

చివరిగా ఈ మొబైలు మెయిన్ ఫీచర్స్ వచ్చేసి 4 GB RAM | 64 GB ROM | 1 TB వరకు విస్తరించవచ్చు, 16.76 సెం.మీ (6.6 అంగుళాల) పూర్తి HD డిస్ప్లే, 50MP 5MP 2MP | 8MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh లిథియం అయాన్ బ్యాటరీ, ఎక్సినోస్ 850 ప్రాసెసర్. మరియు కొన్ని ఇతర వివరాలు వచ్చేసి మూడు రోజుల్లో మొబైల్ డెలివరీ చేయబడుతుంది, కాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in