Huge Security in Telangana 2024: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాన రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. నేడు (మార్చి 15) మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు, రేపు బహిరంగ సభలు, రోడ్ షోలో పాల్గొంటారు. అయితే, ఈరోజు మోడీ హైదరాబాద్ వచ్చి రాత్రి రాజ్ భవన్ లో బస చేసి రేపు ఉదయం నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభకు హాజరు అవుతారు. మరల 18న జగిత్యాలలో జరిగే సభలో పాల్గొంటారు.
నేడు, రేపు జరిగే సభలు, రోడ్ షోలలో ప్రధాని హాజరు..
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో జరిగే సభలు, రోడ్ షోలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. బీజేపీకి మద్దతుగా ఈరోజు 5:15కు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో రోడ్‌షో చేయనున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తారని మొదట బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందగా, ఆ తర్వాత 15న ఆయన పర్యటిస్తారని బీజేపీ నేతలు ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని కేరళ నుంచి ప్రత్యేక జెట్‌లో సాయంత్రం 4:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయన బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో మల్కాజ్ గిరికి వెళతారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు గంటపాటు 1.2 కిలోమీటర్ల మేర రోడ్‌షో పొడిగించనున్నారు.
తెలంగాణలో మోడీ ఎన్నికల ప్రచారం 2024
సాయంత్రం 6.40 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అక్కడ ఈరోజు రాత్రి బస చేసి రేపు (శనివారం) నాగర్‌కర్నూల్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోదీ రానున్నారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ లోక్‌సభ స్థానాలకు ఈ సభ జరగనుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని హైలైట్ చేసేందుకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దేశంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని వివరించి మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను వేడుకోనున్నారు. అలాగే ఈ నెల 18న జరిగే బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.
‘ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్’లో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము రాక..
ప్రధాని గతంలో తెలంగాణకు అనేకసార్లు వచ్చారు. ఇటీవల పలువురు కొత్త పార్లమెంటరీ అభ్యర్థులను పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత కలిగి ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ స్థానాలను కేటాయించారు. 4, 5 తేదీల్లో జరగనున్న రాష్ట్ర తొలి విడత లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్, పటాన్చెరు విజయసంకల్ప సభల్లో పాల్గొన్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక్కరోజు హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలకు హాజరై పార్టీ నేతలు ఆ కార్యక్రమాలు విజయవంతం చేశారు.
హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో జరిగే ‘ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్’లో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఒకే రోజు రాజధానిలో రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సన్నాహకంగా మూడు కమిషనరేట్‌ల పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ మాసంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అసాంఘిక ప్రవర్తనను నిరోధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Huge Security in Telangana 2024