ToDay Rasi Phalalu : ఈరోజు అదృష్టం మీ వెంటనే ఉంది, పనులు విజయవంతగా పూర్తి చేస్తారు.

మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యారాశి, తులారాశి, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం మరియు మీన

రాశుల వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి (Aries)

Aries

ఈ రోజు చాలా సవాళ్ళ తో కూడుకున్నది. కొన్ని విషయాలలో బాగా కష్ట పడవలసి వస్తుంది. ఇంటి పని భారంగా ఉంటుంది. అదే సమయంలో బయట ఎక్కువగ తిరగ వలసి రావచ్చు. అందరి అంచనాల ప్రకారం జీవించే మీ ప్రత్యేకత మీకు లాభం చేకూరుస్తుంది.

వృషభం (Taurus)

ఈ రోజు వృషభ రాశి వారికి అదృష్టం వీరి వెంట వుంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కొత్త పనులు ప్రారంభం మంచిది కాదు కొన్ని రోజులు వేచి ఉండండి. ఈ రోజు పనులు త్వరగా ముగించి సాయంత్రం కుటుంబ సభ్యులతో గడపండి.

మిథునం (Gemini)

ఈ రోజు సాధారణంగా గడచి పోతుంది. మిథున రాశి అధిపతి బుధుడు ఈ రోజు విజయాన్ని లాభాలను అందిస్తాడు. మీ పిల్లల వైపు నుంచి సంతోషకరమైన వార్త వింటారు. మీరు సంతోషంగా ముందుకు కొనసాగాలని అనుకుంటారు.

కర్కాటకం (Cancer)

కర్కాటకం వారికి అదృష్టం వెన్నంటి ఉంటుంది. వేసుకున్న అన్ని ప్రణాళికలలో ప్రయోజనం కలిగి ఉంటారు. ఈ రోజు మీ నిర్ణయాలు అన్నీ మీకు మేలు చేస్తాయి.ప్రజలతో సంబంధాలు మెరుగుపడి మీరు సంతోషంగా ఉంటారు.కొంతమంది మీకు సమస్యలు సృష్టించాలని చూస్తారు.బాల్య వివాహాలలో అడ్డంకులు తొలగి పోతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉండి ప్రణాళికలు ఫలిస్తాయి మీకు ప్రయోజనం చేకూరుతుంది. అదృష్టం వెన్నంటి ఉండటం వల్ల మీ పనులన్నీ పూర్తి అవుతాయి. మీ శత్రువుల వ్యూహాలు ఫలించవు. ప్రాపంచిక సుఖాలు పెరుగుతాయి. చెడు తొలగి మీ హృదయం ఆనందంగా ఉంటుంది. నూతన పరిచయాలు స్నేహంగా మారవచ్చు.

కన్య (Virgo)

Image Credit:Dev Darsan blog

కన్యా రాశి వారికి గ్రహ స్థానం శుభం కలిగిస్తుంది. పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయి. వృద్ధుల సేవకు,శుభకార్యాలకు ఖర్చు చేయడం మీ మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ శత్రువులకు మీరు ఆటంకంగా మారతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

తుల (Libra)

Image credit: pothunalam.com

తులా వారికి అదృష్టం అనుకూలంగా ఉంది. ఇది సంపదను,సంతోషాన్ని కలిగిస్తోంది. కష్టపడి పని చేయవలసి ఉంటుంది. మీ కష్టం మీకు మేలు కలిగిస్తుంది. శత్రువులు హాని కలిగించే అవకాశం కనిపిస్తోంది.అనవసర గొడవలు, కుటుంబ కలహాలు ఉంటాయి. పొద్దు గూకే వేళకు సద్దు మణగ వచ్చు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి డబ్బు లభిస్తుంది. మీ ఆలోచనలు విజయవంతం అవుతాయి తద్వారా మీ మనోబలం పెరుగతుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందం మీకు అనుకూలంగా రావచ్చు. రోజు కష్టం గా ఉంటుంది. మీ ఆలోచనలు మీకు అర్థం అవుతాయి ప్రజలు మీ ఆలోచనపై శ్రద్ధ చూపుతారు.సీనియర్ల అభినందనలు అందుకుంటారు.

ధనుస్సు (Sagittarius)

Image Credit: Astrology Hindi

ధనుస్సు రాశి వారికి అద్రుష్టం అనుకూలంగా ఉంది. సంపదలో పెరుగుదల సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలలో విజయం మీ వైపే ఉంటుంది. సంపద పెరుగుతుంది.స్నేహితుల ద్వారా ధన లాభం,శత్రువులపై విజయం.సాయంత్రం మీ ప్రజాదరణ పెరుగుతుంది.

మకరం (Capricorn)

Image Credit: Hindustan Times Telugu

మకర రాశి వారికి శుభప్రదం గా ఉంటుంది. ఆనందంతో ఉంటారు. మీ గౌరవం పెరిగి, మీ హృదయం ఆనందం కలిగస్తోంది. మీరు పనిచేసే చోట ఏవైనా వివాదాలు ఉంటే పై అధికారుల చొరవతో అవి సమసి పోతాయి.

కుంభం (Aquarius)

Image Credit: Astroved

కుంభ రాశి వారు అద్రుష్టం కలిగి ఉండి సంపద పెరుగుతుంది.కర్మాఫలాల వలన మనస్సుకు శాంతి, సంతృప్తి కలిగిస్తుంది. డబ్బు ఎవరివద్ద నైనా చిక్కుకునే అవకాశం ఉంది.వృద్ధురాలి ఆశీస్సులతో ముందడుగు వేస్తారు, సంతోషం కలిగి ఉంటారు. సోదరులతో ఉన్న పాత వివాదాలు సమసి పోతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈరోజు సంపద పెరిగే అవకాశం ఉండవచ్చు. రోజంతా నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. మీ నిర్ణయాలు తెలివైనవై ఉండాలి. మీ అదృష్ట నక్షత్రం వెలుగుతుంది.వ్యాపారాలలో పెట్టుబడి లాభం చేకూరుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.