ధర్మాచరణ – మార్గదర్శక సూత్రాలు

ప్రతీ మనిషి ధర్మానికి బద్దుడై ఉండటం కొసమే ప్రతీ ఇంట్లోనూ మంచి వాతావరణం ఏర్పడి ఉండాలని మన సంస్కృతి విలువలు చెబుతున్నాయి. అలా ఉండేలా చూడటం ప్రతీ తల్లిదండ్రుల బాధ్యత . ఇందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ విషయమై కొన్ని మార్గదర్శక సూత్రాలు.

ప్రాతస్మరణ :- ఉదయం నిద్ర లేవగానే దంతధావనం స్నానం పూర్తి చేసుకుని ప్రాతస్మరణ వల్లించాలి. అందులో భాగంగా దైవ ప్రార్థన, మాతృభూమికి, ఋషులకు, దేశభక్తులకు, గురువులకు వందనం కలిసి ఉంటాయి. అది చదవడానికి కొద్ది నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోదు.

ధీపం వెలిగించి తెలిసో తెలియకో గతంలో చేసిన తప్పులకు క్షమాపణ వేడుకోవాలి. కేవలం మంచి పనులే చేసే విధంగా మార్గదర్శనం ఇవ్వమని భగవంతుని ప్రార్ధన చేయాలి.

చదువును, లేక వృత్తి సంబంధమైన పనులను శక్తి ఉత్సాహాలతో , నిజాయితీగా ఇతరులకు అన్యాయం జరగని విధంగా సాగించాలి.

భోజనం చేసే ముందు దేవుడిని ప్రార్థించాలి. సరైన జ్ఞానాన్ని, వివేకాన్ని, నిస్వార్థతను ప్రసాదించమని. అలా ఒక ప్రార్థన.

|| సహనావవతు , సహనౌ భునక్తు , సహవీర్యం కరవావహై తేజస్వినావధీత మస్తు మా విద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః||

భగవంతుడు మమ్మల్ని కలిపి రక్షించు గాక! మేం కలిసి భుజింతుము గాక! మేము కలీసి శక్తివంతులమై పని చేస్తాము గాక! ఆదాన ప్రదానములతో కూడిన మా అద్యయనం ద్వారా మేము తెజోవంతులం అవుదుము గాక! మేము ఎవరినీ ద్వేహించము గాక! శాంతి నెలకొను గాక!

తనతో కూడా కలిసి కూర్చున్న వారందరికీ వడ్డన జరిగిన తర్వాతనే భుజించడం మొదలు పెట్టాలి ఇది సరైన పద్ధతి.

దైనందిన జీవితంలో తల్లిని, తండ్రిని, గురువును , అతిథిని దైవాలుగా చూడు, చెడు పనులు చేయవద్దు. ధర్మ సూత్రాలను అనుసరించు అని తైత్తిరీయ ఉపనిషత్తులోని శిక్షా వల్లి అనే అధ్యాయంలో ప్రతీ విధ్యార్థికి చెబుతోంది. ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు అందరికీ వర్తిస్తుంది.

కటువైన మాటలను వాడటం వలన మనకు ఏ లాభం ఉండదు. పైగా విరోధం వచ్చిపడుతుంది. తల్లి తండ్రులను, గురువులను, పెద్దవారిని గౌరవించాలి. స్త్రీలను అంతకంటే ఎక్కువగా ముఖ్యంగా గౌరవించాలి. అన్ని విధాలా వారికి సేవ చేయాలి.

ఇంట్లో భారతీయ సంస్కృతిని , స్వదేశీ వాతావరణాన్ని నెలకొల్పాలి. ఇంట్లో మన మాతృభాషనె మాట్లాడాలి. వివాహాలకు, గృహప్రవేశాలకు, ఇతరా కార్యక్రమాలకు ఆహ్వన పత్రికలకు మన మాతృభాషలోనే ముద్రించాలి. అన్ని శుభ కార్యాలు మన సంప్రదాయం ప్రకారమే జరుపుకోవాలి. జన్మదిన వేడుకలో దీపం వెలిగించాలి కానీ ధీపం ఆర్పడం కాదు.

ఎందుకు అంటే “తమసోమా జ్యోతిర్గమయ” ఓ భగవంతుడా నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు” అనేది మన సంస్కృతి.

నిద్రకు ఉపక్రమించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. దైవ ప్రార్థన, ధ్యానం చేసి సన్మార్గంలో నడిపించమని వేడుకోవాలి.

ప్రతీ ఒక్కరూ యోగ విద్య అభ్యసించాలి. ప్రాణాయామం, ధ్యానం, వంటి వాటి వలన కూడా ఎంతో అద్భుతమైన ఆరోగ్యం చేకూరుతుంది.

 

(సాధనాత్ సాధ్యతే సర్వం..పేజీ సౌజన్యం తో)

Leave A Reply

Your email address will not be published.