Foot care: వర్షాకాలంలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్ నుంచి మీ పాదాలను సంరక్షించుకోండిలా…

Telugu Mirror : వర్షాకాలం మొదలైంది. పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఈ కాలంలో పాదాలు మరియు గోర్ల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా తడిసే అవకాశం ఉంది. కాబట్టి పాదాలు మరియు గోర్ల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్(fungal infection) వచ్చే ప్రమాదం ఉంది.అనగా గోళ్ళ చుట్టూ ఉన్న చర్మం ఎర్రగా మారి ఉబ్బినట్లుగా కనిపిస్తూ దురద పెడుతుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం.

వర్షాకాలంలో ఎక్కువగా మహిళల్లో మరియు పొలం పనులు చేసేవారిలో ఎక్కువగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది . ఎందుకంటే వారు ఎక్కువగా తడిలోఉంటుంటారు అలాంటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం.మనం ఎండాకాలం, చలికాలంలో చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే వర్షా కాలంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో చర్మంపై(Skin) శ్రద్ధ తీసుకోకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యంగా పాదాలకు మరియు కాలి గోళ్ళకు అనేక ఇబ్బందులు వస్తాయి.ఇన్ఫెక్షన్(infection) కనుక వచ్చినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరియు రాకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం.

*గోరువెచ్చని నీటిలో ఒక చెంచా వంట సోడా మరియు కొద్దిగా నిమ్మరసం వేయండి. ఇప్పుడు మీ పాదాలను 10 నిమిషాలు ఆ నీటిలో ఉంచండి. పాదాలకు రిలీఫ్ కలుగుతుంది‌ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు.

Anemia-Disease : రక్తహీనతతో అల్జీమర్స్ వ్యాధి.. అదేంటో మీకు తెలుసా!

*యాంటీ సెప్టిక్ వాడటం చాలా అవసరం. వాడకపోతే పాదాల్లో ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. దీని వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

Foot care
Image credit:zee

*ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో(Warm Water) టీ బ్యాగ్ వేసి మీ పాదాలను అందులో నాలుగు లేక ఐదు నిమిషాలు ఉంచండి. ఈ విధంగా చేయడం వలన పాదాలలో బ్యాక్టీరియా వృద్ధి చెందదు.

*పాదాలను ఎప్పుడూ కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి.పాదాలు తడిసినప్పుడు వాటిని పొడుగుడ్డ తో తుడిచి శుభ్రంగా,పొడిగా ఉంచుకోవాలి.లేదంటే పాదాలు తడిగా ఉన్నప్పుడల్లా వాటిని ఆరబెట్టకుండా అలా ఉంచితే గోళ్ళలోకి నీరు వెళ్లి మరియు కాలి వేళ్ళ మధ్య తేమ ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాదాలను మరియు గోళ్లను(Nails) ఎప్పుడు కూడా పొడిగా ఉంచుకోవాలి.పాదాలలో ఉన్న తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత యాంటి ఫంగల్ పౌడర్ ను పాదాలకు రాయాలి

Home Renovation Loan : ఇంటి రీమోడలింగ్ కి కూడా లోన్..ఈ లోన్‌ ఆప్షన్స్‌ చెక్‌ చేయండి..

ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.ఇటువంటి కొన్ని జాగ్రత్తలు(precautions) పాటించడం వలన వర్షాకాలంలో పాదాలను మరియు గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.