Telugu Mirror : మెరిసే చర్మం కావాలని ఎవరు కోరుకోరు? ఆడవారికైనా, మగవారికైనా తాము అందంగా ఉండాలని కోరుకోవడం సహజం.చర్మాని కాంతివంతంగా మార్చుకోవడం కోసం మార్కెట్లో చాలా రకాల ఖరీదైన వస్తువులు లభ్యమవుతున్నాయి. ఇవి స్కిన్ టైప్(Skin Type) ను బట్టి కూడా అందుబాటులో ఉన్నాయి. అందరికీ అంత ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే స్తోమత ఉండదు కదా. అందుకే అటువంటి వారి కోసం ఈ రోజు మేము ఇంట్లో తయారు చేసుకునే కొన్ని ఇంటి చిట్కాలు చెప్తున్నాం.మెరిసే చర్మం కోసం కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.
Tips for removing blackheads : ముఖం పై మచ్చల బాధ.. ఇంటి చిట్కాలతో మీరే చూడండి తేడా ..
ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్(Beauty Products) కొనలేని వారికి మరియు పార్లర్ కి వెళ్లలేని వారి కోసం ఇవాళ మేము కొన్ని టిప్స్ చెప్పబోతున్నాం.కూరగాయలు పండ్లలో ఉండే కొన్ని సహజమైన లక్షణాలు చర్మం కాంతివంతంగా మార్చడానికి చాలా బాగా సహాయపడతాయి వీటిని ఉపయోగించడం వలన చర్మాన్ని లోపల నుండి క్లీన్(Clean) చేస్తాయి అలాగే మచ్చలను కూడా తొలగిస్తాయి అవేమిటో చూద్దాం.
టొమాటో :
టొమాటో(Tomato) ఫేస్ లో ఉన్న టాన్ మరియు మచ్చలు, ముడతలను తొలగించడంతోపాటు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. టొమాటోలో ఉండే విటమిన్ సి మరియు లైకోపిన్ వల్ల వృద్ధాప్యంలో వచ్చే చర్మ ఇబ్బందుల నుండి చర్మాన్ని కాపాడుతుంది. టొమాటోను అడ్డంగా కట్ చేసి దీనిని ముఖంపై రుద్దడం వలన ముఖం మీద ఉన్న ట్యాన్, మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
నిమ్మకాయ:
నిమ్మకాయ(Lemon)లో విటమిన్- సి సమృద్ధిగా ఉంటుంది. మరియు దీనిలో యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ముఖం మీద ఉన్న మచ్చలను తొలగిస్తుంది. క్యారెట్ రసాన్ని ముఖంపై ఉపయోగించడం వలన జిడ్డు చర్మ సమస్యను తగ్గిస్తుంది. క్యారెట్ రసంలో, ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్(Vinegar) కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఇది ముఖంపై వచ్చే అన్ని సమస్యలను తొలగిస్తుంది.
అరటిపండు:
అరటిపండు(Banana)ఆరోగ్యానికే కాదు చర్మాని కూడా సహాయపడుతుంది. అరటిపండును ఉపయోగించి మాస్క్ తయారు చేసి అప్లై చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ఫేస్ కి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి.
Rainy Season Hair Tips: వర్షాకాలం లో కేశ సంరక్షణ
ఆరెంజ్:
గ్లోయింగ్ స్కిన్ కోసం నారింజ(Orange)ను ఉపయోగించి పొందవచ్చు.నారింజలో విటమిన్-ఎ, బి ,సి మరియు పొటాషియం(Potassium) ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
బొప్పాయి:
బొప్పాయి(Papaya) గుజ్జులో, తేనే పచ్చిపాలు వేసి కలిపి ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేయండి.
కాబట్టి ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొనలేని వారు మరియు పార్లర్ కి వెళ్లే సమయం లేనివారు ఇటువంటి చిట్కాలు పాటించి మచ్చలు ,ముడతలు లేని మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందండి.