Telugu Mirror : అటవీ ప్రాంతం లో ఎన్ని జంతువులు ఉన్న కూడా అల్లరి చేష్టలు చేస్తూ ఉండే కోతులు మాత్రం ఒక ఎత్తులో ఉంటాయి. వింతగా , విచిత్రంగా గిబ్బన్ కోతి (gibbon monkey) , పులి పిల్లలను ఆడుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కథ ఏమిటి? గిబ్బన్ కోతి ఎందుకు అలా చేసి ఉంటుంది అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
గిబ్బన్ కోతి ఉండే ప్రదేశానికి పులి పిల్లలు (Tiger cubs) వచ్చి నిద్రిస్తున్నాయి. పులి ఎక్కడ ఉన్న తన గంభీరాన్ని , క్రూరత్వాన్ని మాత్రం మార్చికోదు.గిబ్బన్ కోతి ఉన్న ప్రదేశానికి వెళ్లిన పులి పిల్లలు గిబ్బన్ పై అధికారాన్ని చెలాయించాలని అనుకున్నాయి. గిబ్బన్ తన భాషలో ఎంత చెప్పినా వినని పులులకు తనదైన స్టైల్ లో పులులకి చుక్కలు చూపించింది. గిబ్బన్ అల్లరి చేష్టలతో , చిలిపి పనులతో పులులని ఒక ఆట ఆడుకుంది. పులుల చెవులను మెలి తిప్పుతూ, వాటి తోకలని లాగుతూ చిలిపి ప్రదర్శన చేసిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.ఈ ఘటన @AMAZlNGNATURE కెమెరా లో చిక్కుకుంది. X ద్వారా ట్విట్టర్ లో వైరల్ గా , ఎక్కువ వ్యూస్ ని సంపాదించింది గా మారింది. ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని కలిగించిన ఈ వీడియో 2.1 మిలియన్ల వ్యూస్ తో ట్విట్టర్ లో తెగ వైరల్ గా మారింది.
Gibbons like to live dangerously pic.twitter.com/gsHBGEweiA
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 18, 2023
కొంటె పనులు చేస్తూ ఆ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీద కు వింత విన్యాసాలు చేసింది ఈ గిబ్బన్ కోతి. అప్పటిదాకా పోరాడి విసుగెత్తిన ఆ పులి పిల్లలు అక్కడ నుండి వెళ్లిపోయాయి.
పులులపై కొంటె పనులు చేసిన చిన్న గిబ్బన్ వినోదకరమైన మరియు ఆసక్తికరంగా ఈ వీడియో మారింది. ఒక వ్యాఖ్యాత ఇలా రాసాడు. ఇది ఎంతో హాస్యాస్పదం గా ఉందని మరియు పులులకు కష్టకాలాన్ని పరిచయం చేసిందని వ్యక్తం చేసారు.మరియు మరొకరు ధైర్యాన్ని ఎత్తి చూయిస్తూ ఆ గిబ్బన్ కి ధైర్యం ఎక్కువే అని రాసారు. ఈ దృశ్యం చూడగానే కొందరికి తమ ఇంట్లో జరిగే సన్నివేశాలు కూడా గుర్తుకు వచ్చాయి. “అతను మరియు అతని భార్య ఏ దిగులు లేకుండా కూర్చున్న ప్రతిసారి అది అతని 8 ఏళ్ల వయస్సు” అని మరొక వ్యూయర్ కొంటె గిబ్బన్ మరియు అల్లరి చేసే పిల్లల మధ్య సమాంతరంగా అతను హాస్యాస్పదమైనది గా గీశాడు అని రాసాడు.
గిబ్బన్ కోతి అలా చేయడం మిస్టరీ గా మిగిలిపోయిందని , ధైర్యంగా ప్రైమేట్ ఆన్ లైన్ వ్యూయర్స్ (online viewers) ని ఎంతగానో అలరించింది.
ఇంతకీ ఈ వీడియో చూస్తే మీకు ఏం అనిపించింది. ఈ వీడియో చూడగానే మీకు ఏం గుర్తుకొచ్చింది.ఈ వీడియో ను చూసి హాస్యాస్పందంగా అనుభూతిని చెందండి.