Telugu Mirror: వర్షాకాలం మొదలైంది. వర్షంలో ఏదో ఒక సందర్భంలో తడుస్తూనే ఉంటారు. వర్షాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే వర్షంలో తడవడం వల్ల కొన్ని సమస్యలు రావడం సహజం. వర్షంలో తడిచినప్పుడు జుట్టు కూడా తడుస్తుంది కాబట్టి, జుట్టు సమస్యలు కూడా వస్తాయి. వర్షంలో తడవడం వల్ల తలలో దురద, చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్(fungal infections) ,హెయిర్ ఫాల్(hair fall) వంటి వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి. వర్షాకాలంలో జుట్టులో ఎక్కువ తడి ఉంటుంది. దీని వలన రూట్స్ నుంచి హెయిర్ బలహీనంగా మారుతుంది. దీంతో జుట్టు రాలడం మొదలవుతుంది. వానాకాలంలో జుట్టు పట్ల సంరక్షణతో పాటు కొంత శ్రద్ధ తీసుకోవడం కూడా అవసరం.
వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం .
ఒకవేళ మీరు వర్షంలో తడిచి ఇంటికి వస్తే వెంటనే షాంపూతో తలస్నానం చేయండి. తలను శుభ్రంగా తుడిచి ఆరనివ్వాలి. ఆ తర్వాత దువ్వండి. వర్షాకాలంలో జుట్టు పెళుసుగా మారుతుంది. కాబట్టి కుదిరినప్పుడల్లా దువ్వెనను మార్చాలి. వెంట్రుకలు చిక్కుపడకుండా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం దువ్వెనకు ఉండే దంతాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడకండి. ఎందుకంటే ఒకరి తలలో ఉన్న ఇన్ఫెక్షన్ మరొకరికి వస్తుంది.
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఉసిరి, కలబంద,మెంతులు మొదలైన న్యాచురల్ ప్రొడక్ట్స్(natural products) ని ఉపయోగించి ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవాలి.
వీక్లీ వన్స్ మీ జుట్టుకు కోకోనట్ ఆయిల్(coconut oil) పెట్టి మసాజ్ చేయండి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టుకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
తలకు హెయిర్ డై వేసుకునే వాళ్లు వర్షాకాలంలో జుట్టు తడవడం వల్ల కలర్ పోతుంది కాబట్టి మీరు జుట్టుకి మంచి హెయిర్ మాస్క్ ని అప్లై చేయండి. మీకు వీలైతే పెరుగు మరియు అవకాడో తో చేసిన హెయిర్ మాస్క్ ను వాడండి.
ఈ వర్షాకాలంలో హెవీ హెయిర్ స్టైల్స్ మరియు హెవీ కెమికల్ క్రీమ్స్ లాంటివి వాడకండి. ఇవి మీ హెయిర్ మరింత ఎక్కువ డామేజ్ చేస్తాయి. వీలైనంత వరకు న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడటానికి ప్రాధాన్యత ఇవ్వండి.
ఈ కాలంలో హెయిర్ కండిషన్ చేయడం కూడా అవసరం. నిర్జీవంగా మరియు చిక్కుబడిన మీ హెయిర్ కు కండీషనర్ వాడటం వల్ల హెయిర్ స్మూత్ గా, మెరుస్తూ ఉంటుంది. కొబ్బరినూనె(coconut oil) మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టులో దుమ్ము, చెమట ,జిడ్డు లేకుండా చూసుకోవాలి. రసాయనాలు తక్కువగా ఉండే షాంపూ తో తలస్నానం చేయాలి. బాగా వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులో ఉన్న సహజ నూనె పోతుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని తల స్నానానికి వాడటం వల్ల జుట్టు లో సహజత్వం అలానే ఉంటుంది.
కనుక వర్షాకాలంలో వచ్చే జుట్టు సమస్యలకు ఇలాంటి జాగ్రత్తలు పాటించి మీ జుట్టు సమస్యల నుండి బయటపడండి