Telugu Mirror : చేపల వేట మజాని కలిగి ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫిషింగ్ ని హాబీ గా కలిగి ఉంటారు.సముద్రాలలో నదీ తీరాలలో,కుంటలు,చెరువులలో ఎంతో మంది ఫిషింగ్ చేస్తూ కనిపిస్తుంటారు.అదే వృత్తిలో ఉన్న వారు కాకుండా,సరదాగా కాలక్షేపంగా చేపలను పట్టేందుకు సమయాన్ని వెచ్చిస్తారు.అయితే వారు ఫిషింగ్ చేసే సమయాలలో ఎన్నో ఆశ్చర్య కరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ఇటీవలనే చార్లీ క్లింటన్ ( Charlie clinton)అనే యువకుడు అటువంటి సంఘటన ని ఎదుర్కొన్నాడు.అతను తనకు దగ్గరిలోని చెరువుకు ఫిషింగ్ కోసం వెళ్ళగా,అతను ఊహించని విధంగా మనిషిని పోలిన పళ్లు ఉన్న ఒక ఫిష్ క్యాచ్ లో చిక్కుకున్నాడు.
Virat Kohli : అంతర్జాతీయ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్ గా రికార్డు!
క్లింటన్ క్యాచ్ గురించి ఓక్లహోమా(oklahoma) డిపార్ట్ మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వారు ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ ని వ్రాశారు. చార్లీ క్లింటన్ అనే యువ ఫిషర్ వీకెండ్ లో దగ్గరిలో ఉన్న చెరువులో చేపలు పడుతున్నపుడు అతనికి ఆశ్చర్య కరమైన రీతిలో అసాధారణమైన రీతిలో అతనిని ఏదో కరచింది.నొప్పితో విలవిలలాడిన చార్లీ దానిని పట్టుకుని చూడగా,సౌత్ అమెరికా కు చెందిన ‘పిరాన్హా'(piranha) జాతికి దగ్గరి సంబంధం ఉన్న ‘పాకు’ చేపగా గుర్తించారు.పాకు చేప ఓక్లహామాలోని మత్స్యకారులకు ఇంతకు ముందు చాలాసార్లు దొరికింది.
View this post on Instagram
ఓక్లహోమా వన్యప్రాణుల సంరక్షణ విభాగం వారు తెలిపిన ప్రకారం పాకు అనేది ఓక్లహోమా నీటిలో స్థానికేతర మైనది,ప్రజలు వాటిని కొనుగోలు చేసి పెంచుతారు.పెరిగిన తరువాత తొట్టెలలోనుంచి వాటిని విడిచిపెడతారు.అలాగే ఈ చేపలు సాధారణంగా మానవులకు హానికరమైనవి కాదు,కానీ నీటి జలాలలో అనవసరమైన పెంపుడు జీవులను వదిలివేయడం వలన వాటిలో నివసించే ఇతర ప్రాణులకు స్థానిక పర్యావరణకు చాలా హానికరం.పాకు చేప 3.5 అడుగులు మరియు 88 పౌండ్ ల పరిమాణం వరకు పెరుగగలదు.ఇవి ఇతర దేశ,ఆక్రమణ జాతులు,ఇవి ఓక్లహోమా స్థానిక పర్యావరణ వ్యవస్థకు హాని కలిగిస్తాయి.అని వన్య ప్రాణి సంరక్షణ విభాగం వారు తెలిపారు.
Real me pad 2: మార్కెట్లో కి రియల్ మీ ప్యాడ్ 2 డిస్కౌంట్ పొందే అవకాశం మీ కోసం
ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ జూలై 18న షేర్ చేస్తే.ఇది సుమారు 4,000 సార్లు లైక్ చేయబడినది.అలాగే పోస్ట్ 3,000 కన్నా అధికంగా షేర్ చేసినారు.ఈ పోస్ట్ ను చూసిన వారు పాకు చేపపై వారి కామెంట్ లను వివిధ రకాలుగా వెల్లడించారు.వాటిలో కొన్ని ఇలావున్నాయి.
ఒక నెటిజన్ “నేను మనిషిని పోలిన పళ్ళు కలిగి 3.5 అడుగుల చేపని చూస్తే,వేరే దేశం వెళ్ళి పోతానని అనుకుంటున్నాను.అక్కడ చల్లగా వుండి చేపలకు మనిషిలా దంతాలు లేవు,”అని రాసారు. మరొకరు ‘ప్రకృతి తల్లి ఎప్పుడూ గెలుస్తుంది.ఇలా తారుమారు చేసి నరకం చూపిస్తుంది ప్రకృతి తల్లి’ అని రాసారు మరొక నెటిజన్ “చార్లీ పాకు చేపను పట్టుకుని మా ఓక్లహోమా జలాల నుండి తీసివేసినందుకు అతనికి ధన్యవాదాలు” అని రాశారు.