Raksha Bandhan: రాఖీ కానుకగా మీ సోదరికి ఇచ్చే నగదు బహుమతి పై పన్ను విధిస్తారా? ఆదాయపు పన్ను నియమాలు ఏంటో తెలుసుకోండి.
Telugu mirror : రక్షా బంధన్(Raksha Bandhan) అద్భుతమైన పర్వదినం తోబుట్టువుల కలయికను గౌరవిస్తుంది. బహుమతులు లేకుండా రాఖీ పండుగ అనేది అసంపూర్ణమైనది. కాలానుగుణంగా ట్రెండ్స్ మారుతున్నాయి కానీ ఎప్పుడూ మారకుండా స్థిరంగా ఉండేది నగదు మాత్రమే. రక్షా బంధన్ కి సోదరులు తమ సోదరీమణులకు ఇచ్చే డబ్బు స్థిరంగా ఉంటుంది. రక్షా బంధన్ 2023 కోసం మీరు మీ సోదరికి ఎంత నగదు బహుమతి ఇవ్వాలను కుంటున్నారు? దీనిపై పన్ను విధించబడుతుందా? ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెబుతున్నాయి.
మీరు మరియు మీ సోదరి రక్త సంబంధీకులు కాబట్టి స్మాల్ టు బిగ్ లేదా బిగ్ టు స్మాల్ వరుసయ్యే బంధువులకు ఇచ్చే బహుమతుల మొత్తం అపరిమితంగా ఉంటుంది. “మీ సోదరికి మీరు ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు మీ చేతిలో లేదా తీసుకున్న తరువాత ఆమె చేతిలో పన్ను విధించబడదు” అని క్లియర్ వ్యవస్థాపకుడు మరియు CEO అర్చిత్ గుప్తా(Archit Guptha) అన్నారు.
Chandrayaan 3: రెండు లక్ష్యాలను సాధించాం, మిగిలింది ఆ ఒక్కటే ఇస్రో బృందం ప్రకటన
ఆదాయపు పన్ను చట్టం లేదా ఇతర నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి పరిమితి లేకుండా మరొకరికి బహుమతి ఇవ్వవచ్చు. నగదు బహుమతులపై కూడా పరిమితి లేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువ, బహుమతులతో సహా ఏదైనా లావాదేవీ కోసం ఎవరి నుండి నగదును స్వీకరించకూడదు అని ట్యాక్స్(Tax) మరియు ఆర్ధిక నిపుణుడు బల్వంత్ జైన్ పేర్కొన్నారు.చట్టానికి లోబడి రూ. 2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీల కోసం బ్యాంకింగ్ ఛానెల్(Banking Channel)లను ఉపయోగించాలని జైన్ సిఫార్సు చేస్తున్నారు.
బహుమతులను తీసుకున్న వారికి సెక్షన్ 56 (2)(X) ని అనుసరించి పన్ను విధించబడుతుంది. అయితే కొంతమంది బంధువులిచ్చే బహుమతులకు ఈ సెక్షన్ కి వెలుపల మినహాయింపు ఉంటుంది ” అని బల్వంత్ జైన్(Balwant Jain) పేర్కొన్నారు.ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఉండేందుకు మీ సోదరికి షేర్లను బదలాయింపు చేయవచ్చు అని అర్చిత్ గుప్తా తెలిపారు.
రక్షాబంధన్ 2023: తేదీ, సమయం ,ముహూర్తం..
ఈ సంవత్సరం రాఖీని ఆగస్టు 30 మరియు 31 తేదీలలో జరుపుకుంటున్నారు కానీ రాఖీలు కట్టే సరైన సమయం గురించి గందరగోళం నెలకొంది. ఈ సంవత్సరం, రక్షా బంధన్ బుధవారం, ఆగస్టు 30.
ఆగస్ట్ 30 రాత్రి 9:01 గంటల తర్వాత రాఖీ కట్టడం ఉత్తమం. ఆగస్టు 31 రాఖీ కట్టేందుకు సమయం: ఉదయం 7:05 గంటలకు ముందు