Jailer Movie Collections : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జైలర్, బాక్సాఫీస్ బద్దలు

Telugu Mirror : రజనీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం జైలర్(Jailer) కలెక్షన్ల స్పీడ్ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మార్కెట్ విశ్లేషకులు మనోబాల విజయబాలన్ నివేదన ప్రకారం, జైలర్ సినిమా వరల్డ్ వైడ్(World Wide) గా రూ. 550 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టిన రెండవ తమిళ చిత్రంగా నిలిచింది . ఆగస్ట్ 10న విడుదలైన ఈ యాక్షన్ చిత్రం 12వ రోజు నాటికి థియేటర్లలో రూ.550 కోట్ల క్లబ్‌లోకి చేరింది. 2018 లో రిలీజ్ అయిన రజనీకాంత్ రోబో2.0 చిత్రం , కేవలం ఎనిమిది రోజులలోనే రూ.500 కోట్ల మైలురాయిని చేరుకుంద.

మంగళవారం X (ట్విట్టర్ ) లోమనోబాల విజయబాలన్ ఇలా రాశారు, “జైలర్ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లు..12వ రోజు తన దైన శైలిలో రూ ₹ 500 కోట్ల (కోటి) క్లబ్‌లోకి ప్రవేశించింది. రజనీ కాంత్ రోబో 2.0 తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుండి అత్యంత వేగంగా ఈ మైలురాయిని సాధించిన రెండవ చిత్రం జైలర్, కేవలం ఎనిమిది రోజులలో రోబో ఈ కలెక్షన్లు వసూలుచేసింది. రజనీకాంత్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్,జాకీ ష్రాఫ్ తదితర తారాగణం నటించిన జైలర్ చిత్రం మొదటి వారంలో- రూ. 450.80 కోట్లు వసూలు చేయగా, 2వ వారంలో రోజు 1 – రూ. 19.37 కోట్లు. 2వ రోజు- రూ.17.22 కోట్లు. 3వరోజున రూ. 26.86 కోట్లు. 4వ రోజు – రూ. 29.71 కోట్లు. 5వ రోజు – రూ. 12.54 కోట్లు. మొత్తం – రూ. 556.50 కోట్లు సాధించింది.

Image Credit : The News Minute

Sacnilk.com ముందుగానే అందించిన అంచనాల నివేదిక ప్రకారం, రెండవ సోమవారం, ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద అన్ని భాషలలో కలిపి భారతదేశంలో రూ.7 కోట్ల వసూళ్లు స్థిరంగా సాధించింది. జైలర్ సినిమా భారత దేశంలో రాబట్టిన కలెక్షన్ ఇప్పుడు దాదాపు
రూ. 288.6 కోట్లు వద్ద స్థిరంగా ఉంది.మనోబాల నివేదిక ప్రకారం, జైలర్ సినిమా తమిళనాడులో రూ.194.7 కోట్ల కలెక్షన్ వసూలు చేసి రూ. 200 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించడానికి అంగుళాల దూరంలో ఉన్నది. ఈ తమిళ చిత్రం హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోకి డబ్ చేయబడింది.

మంగళవారం మనోబాల X లో ట్వీట్ చేస్తూ “జైలర్ సినిమా TN (తమిళనాడు)లో బాక్సాఫీస్ వద్ద స్థిరంగా ఉంది. 1వ వారం – రూ. 159.02 కోట్లు సాధించింది . 2వ వారం 1వ రోజు – రూ. 6.29 కోట్లు. 2వ రోజున – రూ. 5.60 కోట్లు. రోజు3న – రూ.9.47 కోట్లు. 4వరోజు – రూ. 10.35 కోట్లు. 5వ రోజు – రూ. 4.06 కోట్లు వచ్చాయి. సాధించిన వసూళ్ళ మొత్తం -రూ.194.79 కోట్లు. రాష్ట్రంలో రూ. 200 కోట్ల మార్కుకు చేరుకుంది.

Respiratory Syncytial Virus : పిల్లలకు ప్రమాదకరం RSV వైరస్..నివారణకు టీకానే మార్గం..పెద్దలకూ సోకే అవకాశం..

ఈరోజు( 22 ఆగష్టు 2023) ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలాX లో ట్వీట్ చేస్తూ, ” రజనీ కాంత్ రోబో 2.0 తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) రూ. 75 కోట్ల గ్రాస్ ను అధిగమించిన రెండవ తమిళ చిత్రం జైలర్ అని పోస్ట్ చేశాడు. ” మరో ట్వీట్‌లో, “ కర్ణాటకలో రూ. 60 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తమిళ చిత్రం జైలర్. అని వ్రాశాడు.

జైలర్ గురించి.. 

నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వినాయకన్, రమ్య కృష్ణన్, వసంత్ రవి మరియు తమన్నా భాటియా కీలక పాత్రలు పోషించారు. జైలర్‌లో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ మరియు జాకీ ష్రాఫ్ కూడా నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Leave A Reply

Your email address will not be published.