Mega Prince: ప్రిన్స్ పెళ్లి కి మెగా ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు, రహస్య ప్రదేశం లో ఒకటి కానున్న తారలు.

Telugu Mirror: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరగాల్సిన ఒక ఘట్టం. వధూవరులు కలిసి పెళ్లి అనే బంధంతో వారి మనసులను మరియు రెండు కుటుంబాలను ఒకటి చేసే ఈ ఘడియ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఇస్తుంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకొని , పెళ్లి అనే మధుర క్షణాన్ని అనుభూతి చెందడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అతి సమీపంలో ఉన్నారు.మెగా ప్రిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి ముందే లావణ్య త్రిపాఠి భరత నాట్యం పై తనకున్న మక్కువ వరుణ్ కి వివరించి నాట్యం చేసేందుకు అడ్డు చెప్పకూడదు అనే ఒక కండిషన్ పెట్టినట్టు మనందరికీ తెలుసు.

ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి ఈ జంట పై ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.అయితే తాజాగా వెల్లడించిన విషయం ఏంటంటే ఈ జంట నవంబర్ లో ఒకటి కానున్నారు.

మీరు విన్నది నిజమే.. జూన్ లో భాగ్యవంతుడైన తేజ్ ఇంట్లో ఎంతో గొప్పగా జరిగిన వీరి నిశ్చితార్థం, తర్వాత తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం యూరప్‌ (Europe) కు వెళ్లే అవకాశం ఉందనే వాస్తవం అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిస్తుంది. విరాట్-అనుష్క, దీపికా-రణ్‌వీర్, విక్కీ-కత్రినా మరియు ప్రియాంక-నిక్ వంటి సుప్రసిద్ధ బాలీవుడ్ పెళ్లిళ్లను స్ఫూర్తిగా తీసుకుని వరుణ్ మరియు లావణ్య తమ పెళ్లి కోసం ఇటలీలోని రహస్య ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

Varun tej and lavanya tripathi are going to marry in a secret place.
Image Credit: Hindustan Times

Also Read: Jailer Movie Collections : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జైలర్, బాక్సాఫీస్ బద్దలుఒకటి కాబోతున్న ఈ నటులు మిస్టర్ సినిమా (Mister Movie) సెట్ లో మొదటి సారి కలుసుకున్నారు. అప్పటి నుండి తమ రిలేషన్షిప్ ని కొనసాగించారు. సాధారణంగా దక్షిణాది లో అందరి జంటల మాదిరి లాగానే వీరి ప్రేమ విషయం రహస్యంగానే ఉంచారు.

జూన్ 9 న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ తారలు సోషల్ మీడియా లో “నా లవ్ దొరికింది ” అని వరుణ్ పోస్ట్ చేయగా లావణ్య కూడా 2016 లో అదే విషయాన్ని పోస్ట్ చేసింది.

ఈ చూడముచ్చటి జంటకు సినీ తారలు సమంతా రూత్ ప్రభు, సైనా నెహ్వాల్, నిహారిక కొణిదెల, సునీల్ శెట్టి వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం తమ కుటుంబాలు పెళ్లి వేడుకల్లో బిజీ గా ఉన్నారు. వివాహ ప్రణాళిక వస్త్రధారణ నుండి క్యాటరింగ్ మరియు సెట్ డిజైన్ వరకు ప్లాన్ చేస్తున్నారు.కుటుంబం లో ప్రతి ఒక్కరు ఈ వివాహం పై బాధ్యత వహిస్తున్నారు.

పెద్దల సమక్షం లో వివాహానికి సిద్దమైన ఈ జంట ప్రస్తుతం పెళ్లి హాడావిడిలో ఉన్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.