Telugu Mirror : వర్షాలు పడుతున్నాయి. మొక్కలకు వర్షాకాలం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తేమ మరియు నీరు అధికం కావడం వలన వాటికి హాని కలిగే అవకాశం ఉంటుంది .ఈ విధంగా జరిగితే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలంలో కుండీలలో నీరు అధికంగా ఉండటం వల్ల తేమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల మొక్కలు చనిపోతాయి. కాబట్టి వర్షాకాలంలో కుండీలలో మొక్కలకు నీరు పోసే ముందు ఏ మొక్కకు ఎంత నీరు అవసరమో తెలుసుకోవాలి. అలాగే మొక్కకి ఏ విధంగా నీరు ఇవ్వాలో, ఎటువంటి నియమాలు పాటించాలో తప్పకుండా తెలియాలి. కొంతమందికి కుండీలలో మొక్కలు ఎలా పెంచాలో తెలియదు. మొక్కలు కొని కుండీలలో వేస్తారు కానీ తర్వాత వాటి సంరక్షణ మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలియదు. అటువంటి వారి కోసం ఇవాళ మీకు మేము కొన్ని విషయాలను తెలియజేస్తున్నాం.
1 . కుండీలలో పెంచే మొక్కలు కైనా లేదా గార్డెన్లో పెంచే మొక్కలు కైనా నీరు అవసరం.
2. వర్షపు నీరు మొక్కలకు ఉపయోగకరమే కానీ కుండీలలో పెంచే మొక్కలకు నీరు అధికమైతే మొక్కల కుళ్ళిపోతాయి. తద్వారా మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది.
3. కుండీలోని పైన ఉన్న మట్టిని చెక్ చేస్తే తెలిసిపోతుంది తేమ ఎక్కువగా ఉందా లేదా అనే విషయం. దీనిని బట్టి మొక్క పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
4.వర్షాకాలంలో కుండీలలో ఉన్న మొక్కలకు నీరు ఎక్కువై నీరు నిలిచినప్పుడు ఆ నీటిని బయటకు తీసేయాలి.
5. కుండీలోని మొక్కలకు నీరు పోసే ముందు మట్టి తేమను చెక్ చేయాలి. తేమ ఉంటే మొక్కకు నీరు పోయనవసరం లేదు. మట్టి పొడిగా ఉంటే మాత్రమే నీరు పోయాలి.
6. మొక్కలకు ఉదయం సమయంలో నీరు పోయడం శ్రేయస్కరం. అప్పుడు మొక్కలు పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం పూట మొక్కలకు నీరు పోయడం వల్ల మట్టి నీటిని పీల్చుకోవడానికి మరియు తేమను నియంత్రించడానికి సమయం లభిస్తుంది.తద్వారా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.
7. నిరంతరాయంగా వర్షం పడుతుంటే వారం లేదా రెండు వారాలు పాటు మొక్కలకు నీరు పోయడం అవసరం లేదు. కానీ వర్షం తక్కువగా ఉంటే మట్టిని చెక్ చేసి మొక్కలకు నీటిని అందించాలి.
image credit : tv9 telugu
8. వర్షాకాలంలో మొక్కల ఆకులు మెత్తగా ఉండి, లేత పసుపు రంగులో కనిపిస్తే కుండీలో నీరు అధికంగా ఉందని అర్థం. అటువంటి సందర్భంలో మొక్కలకు నీరు పోయడం ఆపివేయాలి.
9. మొక్కలు ఎండిపోతున్నా మరియు వాటి ఆకులు రంగు మారి ఎక్కువగా రాలిపోతున్న అటువంటి సమయంలో మొక్కలకు నీరు చాలా అవసరమని గుర్తించాలి.
10. తేలికపాటి జల్లులు ఉన్నప్పుడు మట్టి పైన తడిగా ఉంటుంది. కానీ అడుగున పొడిగా ఉంటుంది .కాబట్టి కుండీలో మట్టిని చెక్ చేస్తూ ఉండాలి. ఒకటి లేదా రెండు అంగుళాల వరకు వేలిని మట్టి లోపలికి పెట్టి తనిఖీ చేయడం ద్వారా నీరు అవసరమా లేదా అనే విషయం అర్థం అవుతుంది.
11.కుండీలో మొక్కలకు తేమ ఉంటే నీరు ఇవ్వకండి. పొడిగా ఉంటే మాత్రమే నీరు పోయాలి.
12.ఒక కుండీలో రెండు మరియు మూడు రకాల మొక్కలు పెంచినట్లయితే వాటికి నీరు అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే నీరు సరిపోకపోతే మొక్కలు వడలిపోవడం, ఆకులు రంగు మారడం మరియు ఆకులు వంకరగా అవ్వడం జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితులలో మొక్కలకు నీటి కొరత ఉందని అర్థం.కాబట్టి కుండీలో పెంచే మొక్కలకు నీరు పోసే ముందు ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
Ravi Chandra Kota is a senior journalist and editor had vast experience in all types of category news his most interest in health and technology articles.