Wheat Flour Quality: గోధుమ పిండిలో నాణ్యతను విస్తృతంగా పరీక్షించుకోండి ఇలా..కల్తీని తరిమేయండి అలా అలా..
Telugu Mirror: ప్రస్తుత రోజుల్లో మార్కెట్లోకి అనేక రకాల ఆహార పదార్థాలలో కల్తీ జరుగుతుంది. మరి ముఖ్యంగా పిండి వంటి ఆహార పదార్థాలలో కల్తీ బాగా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా చూసి పనులు చేయాల్సిన అవసరం ఉంది లేదంటే కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ రోజుల్లో కల్తీ పిండిలు చాలా ఫాస్ట్ గా అమ్ముడు అవుతున్నాయి అన్న విషయం అందరికి తెలిసిందే. అందరూ రెగ్యులర్ గా గోధుమపిండి(wheat flour)తో రోటీలు చేసుకుని తింటూ ఉంటారు. రోటీ(roti)లు చేసే గోధుమపిండి కల్తీ అయి ఉంటే మనం ఆరోగ్య పరిస్థితి చాలా త్వరగా దెబ్బతింటుంది. దీంతో దేహానికి అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
కలుషితమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి త్వరగా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అటువంటి సందర్భంలో మీరు దుకాణం నుండి గోధుమపిండి(wheat flour) కొనేముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
పిండిలో సుద్ధపొడిని కలిపి అమ్ముతున్నారని తరచుగా వింటున్నాము. దీనివల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది .ఈరోజు మేము గోధుమ పిండిలో కల్తీ ఉందని సులభంగా ఎలా గుర్తించాలో చెప్తున్నాం .పిండిలో కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. అవేమిటో చూద్దాం.
దీని కోసం టెస్ట్ ట్యూబ్(test tube) తీసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా గోధుమపిండి మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి కలపాలి. కలర్ మారితే పిండి కల్తీ జరిగిందని అర్థం. ఇలా చేయడం వల్ల పిండిలో కల్తీ ఉన్నదా, లేదా అనేది మీకే తెలుస్తుంది.
Also Read:Diabetes: శరీరం లో ఇన్సులిన్ కొరత వలన డయాబెటిస్ కాకుండా వచ్చే ఇతర వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఒక గ్లాసు నీళ్లలో టీ స్పూన్(tea spoon)గోధుమ పిండి వేయండి. మరియు దానిలో కొద్దిగా నిమ్మరసం మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్(hydrochloric acid)వేసి కలపండి. ఎరుపు లేదా బ్రౌన్ కలర్ వచ్చినట్లయితే గోధుమపిండి కల్తీ జరిగినట్లు అర్థం.
ఒక గ్లాసు నీళ్లలో టీ స్పూన్ గోధుమపిండి వేయండి. కొద్దిసేపటి తర్వాత నీటిలో పిండి కాకుండా వేరే ఏదైనా తేలితే కల్తీ జరిగిందని అర్థం. పిండిని కొనేటప్పుడు పరీక్షిస్తే కూడా తెలుస్తుంది. పిండిని చూసినప్పుడు అందులో పిండి కనిపించకపోతే పిండిలో కల్తీ జరిగింది అని అర్థం.
ఈ పద్ధతులు చేయడం వీలు కాకపోతే గోధుమలు కొని మర పట్టించుకోవడం శ్రేయస్కరం .ఇది శ్రేష్టమైన గోధుమపిండి. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.