Actor Tarun: మెగా ఫ్యామిలీతో తరుణ్ పెళ్లి ప్రచారం..అసలు నిజమేంటో మీకు తెలుసా?

Telugu Mirror: సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు పెళ్లి వయసు దాటుతున్నాపెళ్లి చేసుకోవాలనే ఆసక్తి చూపించడం లేదు . యంగ్ హీరోలు కూడా పెళ్లి ఊసు ఎత్తకుండ తమ సినిమాలలో బిజీ అవుతున్నారు . హీరో హీరోయిన్ విషయాల గురించి నెట్టింట ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా(social media)లో మరో ఆసక్తికరమైన విషయం హాట్ టాపిక్ గా మారింది .

బాల్యం లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన తరుణ్ తెలుగు లో అనేక సినిమాలు చేసి లవర్ బాయ్(lover boy)గా మంచి గుర్తింపును సాధించాడు.అయితే ఈ లవర్ బాయ్ ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గానే ఉన్నాడు. తన పెళ్లికి సంబందించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగా డాటర్ నిహారిక కొనిదల జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని రెండు ఏళ్ళు సంతోషంగా జీవితాన్ని కొనసాగించారు. తర్వాత వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వాళ్ళ ఇటీవలే వాళ్ళు చట్టబద్దంగా విడాకులు కూడా తీసుకున్నారు . మరో పక్క చూస్తే మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi)చిన్న కూతురు శ్రీజ కూడా కొన్నాళ్ళుగా తన భర్తకు దూరంగానే ఉంటుంది. వెళ్ళిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి జరగబోతుందని నెట్టింట ప్రచారాలు వస్తూనే ఉన్నాయి . తరుణ పెళ్లి గురించి ఇటీవలె తన తల్లి రోజా రమణి గారు కూడా స్పందించారు .తరుణ్ పెళ్లి విషయం గురించి త్వరలోనే అందరు శుభవార్త వింటారని .. అమ్మాయి సినీ ఇండస్ట్రీ కి చెందిన పెద్ద ఫ్యామిలీ నుండి వస్తుందని ఆమె వెల్లడించారు.

Also Read:Baby Movie: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ .. తెర వెనుక రహస్యాలు మీకు తెలుసా ?

rumours about tarun marraiage
image credit:ragalahari

తెలుగు ఇండస్ట్రిలో బడా ఫ్యామిలీ అంటే దగ్గుపాటి , అక్కినేని , మెగా , నందమూరి ఫ్యామిలీసే . అయితే అటు అక్కినేని కుటుంబంలో అసలు ఆడపిల్లలే లేరు ఇటు దగ్గుపాటి(daggubati) కుటుంబంలో వెంకటేష్ కూతురు ఉన్న కూడా తరుణ్ వయతో పోలిస్తే చాలా చిన్నది . మరో పక్క నందమూరి(nandamuri) ఫ్యామిలీ లో పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఎవరు లేరు ఇంకా మిగిలింది మెగా ఫ్యామిలీ.

Also Read:YouTube Premium : ప్రత్యేక ఆఫర్‌లో YouTube ప్రీమియం మూడు నెలల సభ్యత్వం..ఎలా పొందాలో తెలుసుకోండి ఇలా..

మరి ఇంతకీ తరుణ్ పెళ్లాడబోయేది ఎవరిని ? నిహారిక కొనిదల మరియు శ్రీజ వీరిద్దరిలో ఒకరిని లవర్ బాయ్ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని నెటిజెన్ లు తెగ ప్రచారాలు చేస్తున్నారు . అయితే తరుణ్ తల్లి ఈ ఫ్యామిలీ తో పెళ్లి జరుగుతుందని స్పష్టం గా అయితే చెప్పలేదు . ఆమె చెప్పిన మాటను ఆధారంగా తీసుకొని పుకార్లు పుట్టించారు . ఇది వొట్టి పుకారు మాత్రమే అని మెగా ఫామిలీ తేలికగా తీసి పడేసారు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in