Tips for removing blackheads : ముఖం పై మచ్చల బాధ.. ఇంటి చిట్కాలతో మీరే చూడండి తేడా ..

Telugu Mirror : ప్రతి ఒక్కరూ తాము ఎల్లప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. తమ చర్మం ఎప్పుడు మెరిసేలా ఉండాలని దానికోసం ఖరీదైన ప్రొడక్ట్స్(Products) కూడా వాడుతుంటారు. ఎంత ఖరీదు ఉత్పత్తులు వాడినప్పటికీ వాటి ప్రభావం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అలాంటి సందర్భంలో ఫేస్ లో ఉన్న అందం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. వాతావరణంలో కాలుష్యం మరియు దుమ్ము ఎక్కువగా ఉండటం వల్ల చాలా సందర్భాల్లో చర్మ రంధ్రాలలో మురికి పేరుకొని బ్లాక్ హెడ్స్ వస్తాయి.

ముక్కు మీద వచ్చే బ్లాక్ హెడ్స్(blackheads) నిర్మూలించడం చాలా తేలిక. కానీ నుదుటిపై వచ్చే బ్లాక్ హెడ్స్ తొలగించాలంటే కొంచెం సమస్యతో కూడుకున్న పని. స్క్రబ్ చేసి తీసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత అవి మళ్ళీ వస్తూ ఉంటాయి. స్క్రబ్బింగ్(Scrubbing) కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.ఇటువంటి సందర్భంలో ఈరోజు మేము మీకు నుదుటిపై వచ్చే బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు చెబుతున్నాం. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి మీ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. అలాగే ఖర్చు కూడా తక్కువే. అవేమిటో తెలుసుకుందాం.

Rainy Season Hair Tips: వర్షాకాలం లో కేశ సంరక్షణ

గుడ్డు (Egg) : 

గుడ్డు(Egg) చర్మానికి చాలా మేలు చేస్తుంది. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఈ విధంగా చేయండి. ఎగ్ ను పగలగొట్టి రెండు సొన లను వేరు చేయండి. తెల్ల సొన ని తీసుకుని దీనికి ఒక స్పూన్ తేనె కలిపి నుదిటిపై రాయండి. ఆరిన తర్వాత శుభ్రంగా కడగండి.

తేనె మరియు దాల్చిన చెక్క:

తేనె కూడా చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క(Cinnamon) పొడిలో కొద్దిగా తేనె వేసి పేస్టులా కలపండి. ఈ పేస్ట్ నుదుటి పై అప్లై చేసి మృదువుగా చేతులతో స్క్రబ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ రెమిడి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.

Image Credit : Telugustop

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాని ఉపయోగించి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయవచ్చు. దీనికోసం మీరు ఒక గిన్నెలో బేకింగ్ సోడా(Baking Soda) వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను నుదుటిపై రాసి మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగండి.

నిమ్మకాయ:

Tips for skin and health protection:వర్షాకాలంలో ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మ సంరక్షణకు రహస్య చిట్కాలు ఇప్పుడు మీ కోసం

చర్మ సమస్యలను తగ్గించడంలో నిమ్మకాయ(lemon) కూడా బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు నుదుటిపై నిమ్మరసం రాసుకొని పడుకోవాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగండి. దీనిని కొన్ని రోజులు వాడి చూడండి. తేడా మీరే గమనిస్తారు.

ఆర్గానిక్ పసుపు మరియు శెనగపిండి:

ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ బియ్యప్పిండి(Rice Power), రెండు టీ స్పూన్ ల శనగపిండి, అర టీ స్పూన్ పసుపు(Turmeric) మరియు కొద్దిగా పాలు పోసి పేస్టులా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు స్క్రబ్ చేయండి . 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది కూడా బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది.

మేము చెప్పిన ఇంటి చిట్కాలలో ఏదైనా సరే కచ్చితంగా మీ నుదిటిపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తాయి. ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. కాబట్టి కొన్ని రోజుల్లో మీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.