Today Horoscope 24 August 2023: ఈ రోజు వృషభ మరియు సింహ రాశి వారికి అదృష్టమైన రోజు, మిగిలిన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యారాశి, తులారాశి, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం మరియు మీన
రాశుల వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి (Aries)
ఈ రాశి వారికి ఈరోజు కాస్త ఆందోళనగా ఉండే అవకాశం ఉంది. ఆచి తూచి మాట్లాడండి,అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మెస లండి. ప్రశాంతతను పాటించండి అది అనుకోని ఘర్షణలను కలుగనీయదు.
వృషభ రాశి (Taurus)
వృషభరాశి వారు ఈరోజు అదృష్టం కలుగుతుంది. మీ మంచి నడవడిక మరియు ఇతరులను ఆదుకునే గుణం వెలుగు చూస్తుంది. ఈ రోజు ఆపదలో ఉన్నవారికి సహాయ పడతారు. మీ సహోద్యోగులు మీ పై ప్రశంసలు కురిపిస్తారు. విలువైన రాజకీయ సంభందాలు ఏర్పరుస్తారు.
మిధున రాశి (Gemini)
మిథున రాశి వారికి ఈరోజు మానసిక,శారీరక ఆటంకాలు ఎదురుపడవచ్చు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తీరిక లేకుండా ఉండే రోజు కోసం సిద్ధంగా ఉండండి. ఈ రోజు పెట్టుబడులకు దూరంగా ఉండండి,ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత ప్రతికూలత ఎదుర్కోవచ్చు. మీరు కలత చెందే వివిధ సమస్యలు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ ఆలోచనలు పంచుకునే సమయంలో గొడవలను రాకుండా జాగ్రత వహించండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈరోజు శుభప్రదం గా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం ద్వారా సంతోషం కలిగి ఉంటారు. ఆర్ధిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
కన్య (Gemini)
కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. మీరు చిన్న సంజ్ఞలలో సంతోషాన్ని పొందుతారు మరియు మీ ప్రయత్నాలను కుటుంబ సభ్యులు అభినందిస్తారు. ప్రస్తుత వాహనంలో సమస్యలతో జాగ్రత్త. కొత్త వాహనం కోనుగోలు కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
తుల (Libra)
తులారాశి వారు ఈరోజు కొంత ప్రతికూలతను కలిగి ఉంటారు.
సానుకూలత కోసం ప్రయత్నం చేయండి. స్నేహితులు,కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. ఇష్టమైన వంటలతో పార్టీ చేయండి. కుటుంబం తోఉల్లాసంగా గడపండి.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈరోజు అంతా ఆనందం వెంట ఉంటుంది. కుటుంబంతో విలువైన సమయాన్ని గడపండి, చిన్నపిల్లలతో కొన్ని సరదా పనులతో గడపండి. మీ సోదరీమణులతో మీకున్న ఏవైనా సమస్యలను పరిష్కరించుకోండి.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి, ఈరోజు అనుకున్న సమయానికి పనులు ముగింపు మరియు అకారణంగా తొలగింపుల కారణంగా ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించండి మరియు మీ బంధాన్ని దృఢం చేసుకోవడానికి మీ జీవిత భాగస్వామితో ప్రేమకలిగి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.
మకరం (Capricorn)
మకర రాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ భక్తిని కుటుంబ సభ్యులు ప్రశంశిస్తారు. మీ పిల్లల నుండి శుభవార్త కోసం ఎదురు చూడండి మరియు ఆపద ఉన్నవారికి సహాయం చేయండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈరోజు విజయం వెన్నంటి ఉంది. మీ పనులలో మీకు లాభం ఉన్నప్పటికీ,ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. మీ వ్యాపార ఆలోచనలు ముందుకు నడుస్తాయి. ఎదురు పడే ఆటంకాలను అధగమిస్తారు.
మీన రాశి (Pisces)
మీనం రాశివారికి ఈరోజు అనుభవాల కలబోతను కలిగి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని మెరుగు పరుచు కోండి మరియు వారి ఆలోచనా ధోరణిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపార పనులలో జాగ్రత్త కలిగి ఉండాలి మరియు విద్యార్థులు క్రీడా పోటీలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు.