Telugu Rasi Phalalu : నేటి రాశి ఫలాలు..కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు వీరికి లభిస్తుంది.పిల్లల నుండి వీరు మంచి శుభవార్త వింటారు..

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యారాశి, తులారాశి, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం మరియు మీన రాశుల వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం :

Aries

మేష రాశి విద్యార్థులకు ఈ రోజు శుభం కలుగుతుంది. ఈ రాశి వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా గడుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయి. పని ప్రదేశంలో తోటి ఉద్యోగులు మరియు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు.

వృషభం : 

Taurus

ఈ రోజు ఉత్సాహంగా తీరికలేకుండా ఉంటుంది. ఏ విషయంలో నైనా అజాగ్రత్తగా ఉండవద్దు లేకుంటే తీవ్రంగా నష్టోతారు. ఆగిపోయిన పనులను చేపట్టండి. చేపట్టాలి అనుకున్న పనులు పూర్తి చేయండి సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం కుటుంబంతో ఏదేని శుభకార్యానికి వెళ్ళే అవకాశం ఉంది.

మిథునం : 

Gemini

ఈరోజు మిథున రాశి వారు అనవసర ఖర్చులను తగ్గించండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది, మీ క్రేజ్ పెరుగుతుంది. మీ పనితీరుకు ప్రజలు ఆకర్షితులవుతారు. ఆకస్మిక ధన లాభం అలాగే పిల్లల నుంచి శుభ వార్త వింటారు.

కర్కాటకం : 

Cancer

కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది, అదృష్టం మీ వైపే ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవాలి అయితే ఎవరైనా అనుభవజ్ఞులు సలహా తీసుకోవటం ఉత్తమం. మీ తల్లి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది. మీ జల్సా ఖర్చుల మూలంగా మీ బడ్జెట్ కేటాయింపులు దెబ్బతింటాయి. తల్లిదండ్రులను సేవించండి ఆశీస్సులు ఉంటాయి.

సింహం : 

Leo

ఆర్ధిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చంచల స్వభావం కారణంగా మీ మనస్సు చికాకుగా ఉంటుంది. గందరగోళానికి,ఒత్తిడికి గురవుతారు. తరువాత రోజు విశ్రాంతి తీసుకుంటారు.అత్త, మామలతో ఇబ్బందులు ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ బంధువులతో ఆర్థిక లావాదేవీలు జరుప వద్దు. ఎవరితోనూ వాదనకు దిగకుండా మృదువైన సంభాషణను కలిగి ఉండండి. ఆఫీస్ లో పని పైనే దృష్టి నిలపండి ఇతర విషయాలలో తల దూర్చకుండా ఉండండి.

కన్య : 

Virgo

కన్య రాశి వారికి ఈరోజు ఆహ్లాదకరంగా మొదలవుతుంది. ఎలాంటి అనుమానం లేకుండా పనులను పూర్తి చేస్తారు. కష్ట మైన విషయాలను పూర్తి చేస్తారు అలాగే ఇతరులకు సహాయపడతారు. కొన్ని విషయాలలో డబ్బు ఖర్చు అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

తులా రాశి : 

Capricon

తులా రాశి వారికి ఈరోజు శుభప్రదం గా ఉంటుంది. ఈరోజు అధికారం, ఆస్తి రెండూ పెరుగుతాయి. ఇతరులకు సహాయం అందించడంకోసం ఈరోజు మొత్తం పరుగులు పెడతారు. కొన్ని విషయాలలో డబ్బు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అది మీకు లాభం చేకూరుస్తుంది.

వృశ్చికం : 

Scorpio

వృశ్చిక రాశి వారు చంచలంగా ఉంటారు. వ్యాపారంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం ఫలించే అవకాశాలు తక్కువ. తెలివి తేటలతో శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక కేసు విషయంలో విజయం సాధించినట్లు వార్తలు రావచ్చు.విజయం సాధించే అవకాశం పూర్తిగా ఉన్నది.

ధనుస్సు : 

Sagittarius

ధనుస్సు రాశి వారు వృత్తి , ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. తెలివి, జ్ఞానం అభివృద్ది చెందుతాయి.మతపరమైన విషయాలకు మనఃస్ఫూర్తిగా ఖర్చు చేస్తారు. అదృష్టం కలుగుతుంది. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.ఆహారాన్ని మితంగా తీసుకోవాలి వ్యాయామం చేయండి.

మకరం : 

Capricorn

మకర రాశి వారికి ఆర్ధికంగా బావుంటుంది అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి.అనుకోకుండా బలవంతంగా ఖర్చు చేయవలసి వస్తుంది. అత్త మామల గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఏదైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే పెట్టండి. ఇది మీకు కలిసి వస్తుంది.

కుంభం :

Image Credit: Astroved

 ఈ రాశి వారికి ఆర్థికంగా బావుంటుంది. మీ తెలివి సమయానుకూలంగా పెట్టుబడి పెడుతుంది. అనవసర ఖర్చుల వలన భవిష్యత్ పెట్టుబడులు ఆగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మోసం ఎదురవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రాపంచిక సుఖాలు భోగాలు పొందుతారు. ఇది మీకు కలిసి వస్తుంది.

మీనం : 

Pisces

మీన రాశి వారికి ఈ రోజు కొన్ని విషయాలలో కలసి వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఏ పని అయినా పూర్తి అవుతుంది. ఉల్లాసవంతమైన మీ వ్యక్తిత్వం వలన ప్రయోజనం కలిగి మీ వ్యాపారం పూర్తి అవుతుంది. ఈరోజు సామాజిక గౌరవం లభిస్తుంది ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Leave A Reply

Your email address will not be published.