Vastu tips for your house: మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తరిమేసి..సానుకూల శక్తి ని ఆహ్వానించాలంటే ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..
telugumirror: హిందూ మతంలో వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి నిర్మాణ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఏం ఉంచాలి ఏది ఎక్కడ పెట్టాలి అని స్పష్టంగా ఉంటాం. వాస్తు ప్రకారం, మీ ఇంటి ప్రధాన ద్వారానికి ప్రాధాన్యతని ఇవ్వడం చాల ముఖ్యం.ఇలా చేయడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి. విస్తారమైన దోషం ఉన్న వారి ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి ఇంట్లో గొడవలు, సఖ్యత లేకపోవడం లాంటివి జరుగుతాయి.చెడుని కలిగిన ఈ ప్రతికూల శక్తి మీ ఇంట్లో అనేక విధాల ఇబ్బందులను కలుగజేస్తుంది.
మీ ఇంట్లో ప్రతికూల శక్తి పోయి సానుకూల శక్తి రావాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని చక్కగా మరియు శుభ్రంగా ఉంచాలి. ఎందుకనగా,నెగటివ్(negative) మరియు పాజిటివ్ ఎనర్జీ(positive energy)మీ ఇంటి ముఖ ద్వారం నుండే ప్రవేశిస్తాయి.అదృష్టం మీ చెంతకు చేరాలంటే ప్రతి రోజు నీటిని మీ ప్రధాన ద్వారం వద్ద చల్లండి. పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం , ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లడం ఇంట్లో పరిశుభ్ర వాతావరణాన్ని కలిగిస్తుంది. అయితే ఈ నీటిని ఎప్పుడు, దేనిలో కలిపి ఉపయోగించాలో పర్యావరణ శాస్త్రవేత్తల వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Gruha Lakshmi Scheme: మీ ఇంటి నిర్మాణం ఇంకా కలగానే మిగిలిందా? గృహలక్ష్మి పథకం తో నెరవేర్చుకోండి మరి!
ఇంటి ముఖ ద్వారం లో నీళ్లు చల్లడం :
వాస్తు శాస్త్రం ప్రకారం, తెల్లారుజామున నిద్రలేచి, స్నానం చేసి ఒక రాగి చెంబులో ప్రధాన ద్వారానికి ఇరు వైపులా నీళ్లు చల్లడం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటె అవి దూరం అయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు.మీ ఇల్లు ఆనందం, అధిక సంపద మరియు గెలుపును మీ సొంతం చేసుకుంటారు .దిగులు చెందని జీవితాన్ని అనుభవిస్తారు.నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
ఇంటి ముఖ ద్వారం లో ఉప్పు నీళ్లు చల్లడం :
పర్యావరణ శాస్త్రవేత్తల(Environment Scientists)ప్రకారం, వారానికి ఒకసారి ముఖ ద్వారం దగ్గర ఉప్పు నీటి(salt water)తో చల్లడం ద్వారా క్రిమికీటకాలకు ఉప్పు అడ్డుగా నిలుస్తుంది మరియు మరియు సూక్ష్మజీవులను చంపేస్తుంది. ఉప్పు కీడును లేదా చెడును తిరస్కరిస్తుంది. కాబట్టి ఉప్పు నీటిని మీ ప్రధాన ద్వారం లో చల్లడం ఎంతో మంచిది.
ఇంటి ముఖ ద్వారం లో పసుపు నీళ్లు చల్లడం :
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయాన్నే తలంటు స్నానం చేసి , రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు ను కలిపి మీ ఇంటి ముఖ ద్వారానికి ఇరు వైపుల చిలకరించండి. అలా చేయడం వల్ల మీరు సుఖసంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో ఎటువంటి సమస్యలు లేకుండా జీవిస్తారు.ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు, విజయనికి చేరువ అవుతారు.