Vistu tips for house: ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. అదృష్టాన్ని స్వాగతించి సుఖ సంతోషాలకు వారధి కట్టండి..
వాస్తు చిట్కాలు: మనచుట్టూ అనేక శక్తులు ఉంటాయి.ఏదో ఒక రకంగా వాటి ప్రభావం మనపై పడుతుంది.అది వస్తువు కావచ్చు,దుస్తులు,రంగులు,ఫర్నీచర్ కూడా అవ్వొచ్చు.వీటి యొక్క స్థానం కూడా ఇంటిలోని వారి మానసిక స్థితి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. ఫెంగ్ షుయ్(peng shuai)ప్రకారం వస్తువులను అమర్చడం ద్వారా జీవితం ప్రశాంతంగా,ఆశాజనకంగా,రిలాక్స్ గా, వుంటారు. వాస్తు శాస్త్రం(vastu shasthram) ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ(negative energy)ని తొలగిస్తుంది మరియు పాజిటివ్ ఎనర్జీ(positive energy)యొక్క సానుకూలతను పెంచుతుంది. వాస్తు ప్రకారం, ప్రజలు తమ ఇళ్లలో వాస్తు సంబంధిత మార్పులు మరియు వస్తువులను వినియోగిస్తున్నారు. వాస్తు శాస్త్ర నమ్మకం ప్రకారం, ఇంట్లో వాస్తుకు సంబంధించిన సానుకూల విషయాలు జీవితంలో శుభ ఫలితాలని తెస్తాయి మరియు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ యొక్క కమ్యూనికేషన్‌ను పెంచుతాయి. వాస్తు ప్రకారం, మీ జీవితం అనేక సమస్యలతో ముడిపడి అస్తవ్యస్తంగా మారితే, వాస్తు శాస్త్రంలో చెప్పిన కొన్ని సులభమైన రెమిడీలను కూడా మీరు పాటించవచ్చు.తద్వారా జీవితంలోని సమస్యలను తొలగించు కోవచ్చు.
Also Read:Brahma Muhurtam–బ్రహ్మ ముహూర్తం ఎందుకు ప్రత్యేకం? దీంతో విజయానికి సంబంధమేంటి?
వాస్తుశాస్త్రంలోని ఈ విధానాలను పాటించడం ద్వారా మీ అదృష్టాన్ని మెరుగు పరుస్తాయి.
ఆర్థిక పరమైన సమస్యలు, సంపదలేమి మీ సంతోషాలను దూరం చేస్తున్నాయని బాధపడుతుంటే ఇంట్లో వెదురు మొక్కను పెంచండి. వాస్తు శాస్త్ర విశ్వాసం ప్రకారం, వెదురు మొక్క సంపదను మరియు శుభ స్థితిని ఆకర్షిస్తుంది.
ఆగ్నేయ దిక్కున ఉన్న ఇంటి గదిలో మనీ ఫ్రాగ్(money frog) ను ఉంచడం వలన మనిషికి డబ్బుకి లోటు ఉండదు. వాస్తు కప్పను ఇంట్లో ఉంచడం వల్ల శ్రేయస్సు మరియు వృత్తిలో అభివృద్ది పెరుగుతుంది.
మీరు మీ ఇంట్లో సంతోషం, శుభ స్థితి మరియు పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండాలంటే, మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ(Laughing Budha)విగ్రహాన్ని పెట్టండి. వాస్తు నమ్మకం ప్రకారం, లాఫింగ్ బుద్ధను వాస్తు నియమం ప్రకారం ఉంచినట్లయితే, అది త్వరలో దాని ఎఫెక్ట్ చూపుతుంది.
Also Read:Iscon Golden Temple : హైదరాబాద్ లో హరే కృష్ణ దేవాలయం.. అద్భుత చరిత్ర
మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నా గాని ఉద్యోగ-వ్యాపారంలో అభివృద్ది లేకుంటే, మీరు ఇంట్లో అందమైన గాలి కొట్టం పెట్టుకోవాలి. ఇది వ్యాపారంలో పురోభివృద్దికి కొత్త త్రోవలను ఏర్పరుస్తుంది. ఒక వ్యక్తి ఎదుగుదలకు నూతన మార్గాన్ని పొందుతాడు.
మీరు వ్యాపారంలో అభివృద్ది చెందాలంటే , మీ వ్యాపార స్థలంలో రెండు చేతులతో నవ్వుతున్న బుద్ధుని విగ్రహాన్ని ఉంచండి. ఈ ఫెంగ్ షుయ్ పరిష్కారం త్వరలో మీకు వ్యాపారంలో లాభాన్ని తెస్తుంది.