Telugu Mirror : పప్పుతో వండిన వంటకాలను అందరూ ఇష్టపడుతుంటారు.ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా వండే వంటకం పప్పు. పప్పు అనేక రకాల పద్ధతులలో వండుకోవచ్చు. పప్పుతో ఏమి వండినా చాలా రుచిగా ఉంటుంది. మనం పప్పు వండినపుడు ఏదైనా ఒక్క రకం పప్పుతోనే మామిడికాయ పప్పు, టమాట పప్పు, ఆకుకూరపప్పు, ముద్దపప్పు, పప్పు చారు ఇలా అనేక రకాలుగా పప్పుని వండుతారు. అయితే ఇది ఒక రకమైన పప్పుతోనే తయారు చేస్తాం. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే పప్పు ఐదు రకాల పప్పులతో తయారు చేస్తారు. ఇది రాజస్థానీ వంటకం. రుచితో పాటు చాలా పోషకాలు కలిగి ఉన్న ఆహారం. శాఖాహారులకు ఇది ఒక బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. వారు హ్యాపీగా లాగించవచ్చు.ఐదు రకాల పప్పులను ఉపయోగించి పప్పు ఎలా తయారు చేయాలో వాటికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
Parenting-Tips : మొక్కై వంగనిది మానై వంగునా..పిల్లల భద్రత పేరెంట్స్ చేతిలోనే..
కావలసిన పదార్థాలు:
1. పావు కప్పు మినప్పప్పు
2. పావు కప్పుకందిపప్పు
3. పావు కప్పు పెసర పప్పు
4. పావు కప్పుశనగపప్పు
5.పావు కప్పు మసూర్ పప్పు
6. ఉల్లిపాయ మీడియం సైజ్ 1
7.అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
8. పచ్చిమిర్చి నాలుగు లేక ఐదు
9. టమాటో రెండు
10. పసుపు అర టీ స్పూన్
11.ధనియాల పొడి ఒక టీ స్పూన్
12. నూనె లేదా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
13. జీలకర్ర ఒక ఒక టీ స్పూన్
14.ఉప్పు రుచికి సరిపడా
15. ఇంగువ చిటికెడు
16.ఫ్రెష్ కొత్తిమీర.
Dosa Recipe : ఇనుప పెనం పై ఫటా ఫట్ దోసె చేసేయండి ఇలా..
తయారీ విధానం:
ఐదు రకాల పప్పులను శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ పప్పులన్నీ ఒక బౌల్ లో వేసి మునిగే వరకు నీళ్లు పోసి, ఒకటి నుంచి రెండు గంటలపాటు నానబెట్టాలి .ఆ తర్వాత నాని ఉన్న పప్పులను కుక్కర్ లో వేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు చిన్న మంటపై కుక్కర్లో ఉడికించాలి.మరొక కడాయి తీసుకుని దానిలో నెయ్యి లేదా నూనె వేసి వేడి అయిన తర్వాత జీలకర్ర మరియు ఇంగువ వేసి వేగనివ్వాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయ వేగాక టమాట ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఉడికించాలి. ఆ తర్వాత ఉడికి ఉన్న పప్పు వేసి దీనిలో కలపాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసి చిన్నమంట మీద సుమారుగా 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లాలి. పంచరత్న పప్పు రెడీ.ఈ పప్పు వైట్ రైస్ మరియు చపాతీ లోకి చాలా రుచిగా ఉంటుంది.