Telugu Mirror : భారత క్రికెట్ ఆటగాడు విరాట్ కొహ్లీ(virat kohli) తన 500 వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు.ఈ మ్యాచ్ ద్వారా భారత మాజీ కెప్టెన్ అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు.వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తున్న భారత పరుగుల మెషీన్ కోహ్లీ శుక్రవారం నాడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండవ టెస్ట్ రెండవ రోజున అద్భుత సెంచరీని సాధించాడు.
Real me pad 2: మార్కెట్లో కి రియల్ మీ ప్యాడ్ 2 డిస్కౌంట్ పొందే అవకాశం మీ కోసం
తన కళాత్మకమైన బ్యాటింగ్ తో, టెక్నికల్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ,180 బంతుల్లో,షానన్ గాబ్రియెల్ బౌలింగ్ లో కొట్టిన ఫోర్ తో తన 29వ టెస్ట్ సెంచరీని(Test Century) సాధించాడు. ఈ సెంచరీని సాధించడం ద్వారా ప్రస్తుత క్రికెటర్ లలో గొప్ప బ్యాట్స్ మెన్ గా తన ఖ్యాతిని నిలుపుకున్నాడు.ఈ సెంచరీతో కొహ్లీ గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ సెంచరీ కరువును కూడా తీర్చుకున్నాడు. 2018 డిసెంబర్ తరువాత విదేశాలలో తన మొదటి టెస్ట్ సెంచరీని చేశాడు.
టెస్ట్ మ్యాచ్ లో 29వ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ లెజండరీ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్ మన్ అత్యధిక సెంచరీల రికార్డ్ ను చేరుకున్నాడు.టెస్ట్ క్రికెట్ లో సర్ బ్రాడ్ మన్(Sir Don Broadmann)52 టెస్ట్ లు ఆడి 29 సెంచరీలు చేయగా,ఇప్పుడు కోహ్లీ తన 111వ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించినాడు.కోహ్లీ శతకం పూర్తి కాగానే అప్పుడు క్రీజ్ లో ఉన్న తన భాగస్వామి జడేజా ను ఆలింగనం చేసుకున్నాడు.అతని సహచరులు నిలబడి ప్రశంశలను అందించారు.
ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు శనివారం , జూలై 22, 2023 తిథి ,పంచాంగం
2019 నవంబర్ మరియు 2023 మార్చి మధ్యలో 41 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఒక్క సెంచరీని కూడా సాధించలేదు. ఎట్టకేలకు ఈ సంవత్సరం అతను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్ లలో రెండు టెస్ట్ సెంచరీలను సాదించాడు.
ఈ సెంచరీతో కోహ్లీ తన వ్యక్తిగత రికార్డ్ లను మెరుగు పరచు కున్నాడు.ఈ సెంచరీతో బ్రాడ్ మన్ సరసన చేరడంతో పాటు కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డ్ ను రాసుకున్నాడు.టెస్ట్ క్రికెట్ లో మరో లెజండరీ వీరేంద్ర సెహ్వాగ్(verender Sehwag) రికార్డ్ ను దాటినాడు.టెస్ట్ క్రికెట్ లో సెహ్వాగ్ 8,586 పరుగులు చేసి భారత తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ లలో ఐదవ స్థానంలో ఉన్నాడు.ఈ ఫీట్ ను సెహ్వాగ్ 200 టెస్ట్ లు ఆడి 53.78 సగటుతో సాధించాడు.ఇప్పుడు కోహ్లీ సెహ్వాగ్ పరుగులను అధిగమించడం ద్వారా భారత క్రికెటర్లలో టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా నిలిచాడు.