Telugu Mirror : ప్రపంచంలో ప్రతి ఒక్కరు వ్యక్తిత్వం మరియు ప్రవర్తించే విధానం ఒకేలా ఉండదు. చాలా విభిన్నంగా(Different) ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఇతరులతో కలవకపోవడం, ఫ్రీగా మాట్లాడలేకపోవడం, సత్సంబంధాలు పెంచుకోకపోవడం చేస్తుంటారు. వీరు ఇలాంటి పనులు చేయడానికి కష్టంగా భావిస్తారు. అయితే అంతర్ముఖ(Introvert) వ్యక్తిత్వం ఉన్నవారు కఠినమైన జీవితాన్ని కలిగి ఉంటారని అనుకుంటే అది పొరపాటే అని అధ్యయనాలు అంటున్నాయి.
వీరి గురించి వివరంగా తెలుసుకుందాం:
అంతర్ముఖ వ్యక్తిత్వం(Introvert) అనేది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అయితే ఇలా ఉన్నవారికి సొంత ప్రయోజనాలు కలిగి ఉంటారని సూచించారు. అంతర్ముఖ వ్యక్తిత్వం ఉన్నవారు ఏ విషయమైనా గుర్తించుకోవడంలో, మరియు సమస్యలను తేలికగా పరిష్కరించడంలో గొప్పవారు అని అధ్యయనాలు కనుగొన్నారు. ఇటువంటి వ్యక్తిత్వం వలన అనేక రకాల ఆచరణాత్మక ఉపయోగాలను కలిగి ఉంటారు. అంతర్ముఖ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అంతర్గత ఆలోచనలపై దృష్టి పెట్టడం వీరికి ఇష్టం. వీరు ఎక్కువ మందితో కాకుండా ఒకరు లేదా ఇద్దరితో మాత్రమే సమయం గడపడానికి ఇష్టపడతారు.
PM Vishwakarma Yojana : చేతి వృత్తుల వారికి మొదటి సారి కేంద్రం చేయూత..అర్హులు వీరే
అంతర్ముకుడు(Introverter) అనగా సిగ్గుపడే లేదా నిశ్శబ్దంగా మరియు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తి అని అర్థం. సాధారణంగా ఉండే వారి కన్నా వీరి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది. సైకాలజిస్టులు(Psychologists) కూడా దీని గురించి భిన్నమైన సిద్ధాంతాలను కలిగి ఉన్నారు.
1920లో (Carl Jung) అనే మనస్తత్వ వేత్త ఇంట్రో వర్ట్(Introvert) మరియు ఎక్స్ట్రా వర్ట్(Extravert) అనే పదాలను వాడటం మొదలుపెట్టారు. అమెరికాలో సుమారు మూడోవంతు మంది అంతర్ముఖులు ఉండవచ్చని కార్ల్ జంగ్ అన్నారు. అయితే మీరు అంతర్ముఖులా లేదా బహిర్ముఖులా చెప్పడం అనేది అధ్యయనాలలో స్పష్టత లేదు.
పరిశోధకులు అంతర్ముఖ వ్యక్తుల మానసిక స్థితిపై అధ్యయనాలు జరిపారు మరియు ఏమని కనుగొన్నారు అంటే, మెదడు రసాయనం మరియు మెసెంజర్(Messenger) కూడా అంతర్ముఖ వ్యక్తులలో భిన్నంగా ప్రవర్తిస్తాయని కనుగొన్నారు. వీరి యొక్క మెదడు బహిర్ముఖుల మెదడు కంటే విభిన్నంగా ఉంటుంది. మరియు డోపమైన్ కు ప్రతిస్పందిస్తాయి. రసాయన డోపమైన్ మీ మెదడులోని గిఫ్ట్ మరియు ఆనందాన్ని కోరుకునే భాగాన్ని సక్రమంగా చేస్తుంది.
గర్భధారణ సమయం లో గర్భిణీలు తీసుకునే యోగ జాగ్రత్తలు..అవేంటో మీకు తెలుసా ?
అంతర్ముఖులు మరియు బహిర్ముఖులు ఈ రసాయనాన్ని ఒకే మొత్తంలో కలిగి ఉన్నప్పటికీ అంతర్ముఖులకు దీని నుండి ఉపయోగం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.అంతర్ముఖ వ్యక్తులు ఫ్రంటల్ లోబ్ లో అధిక రక్త ప్రసరణను కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు(Scientists) కనుగొన్నారు. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని ఒక భాగం. ఇది విషయాలను గుర్తుంచుకోవడానికి మరియు సమస్యలను పరిష్కారం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే జీవితంలో ముందుకు వెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే వీరు అధిక నాణ్యతతో విషయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అని అధ్యయనాలు అంటున్నాయి.
అనగా ఇటువంటి వ్యక్తులు అధికంగా జ్ఞాపకశక్తిని కలిగి ఉండి సమస్యలను సులువుగా పరిష్కరించడంలో అధిక సామర్థ్యంను కలిగి ఉంటారు. తద్వారా జీవితంలో ముందుకు వెళతారు.