Krishnastami 2023: ఈసారి కృష్ణాష్టమి ఎప్పుడో తెలుసా? కన్నయ్యకు చేసే పూజ వివరాలు తెలుసుకోండిలా.

Telugu Mirror : శ్రీ కృష్ణ జన్మాష్టమి హిందూ పురాణాలలో మహా విష్ణువు(Lord Vishnu) ఎనిమిదవ అవతారము.శ్రీ కృష్ణుడి జన్మదినము. ప్రతి సంవత్సరం, భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి లేదా శ్రీ కృష్ణ జన్మోత్సవ్ పండుగను జరుపుకుంటారు.  హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణి(Rohini) నక్షత్రంలో ఈ రోజున జన్మించాడు.

కృష్ణ జన్మాష్టమి 2023 తేదీ

ఈ ఏడాదిలో రోహిణి నక్షత్రం మరియు అష్టమి తిథి జన్మాష్టమి నాడు రాత్రి పూట వస్తాయి. అందుకే కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6న వస్తుందా లేక సెప్టెంబర్ 7న వస్తుందా అని భక్తులు అయోమయంలో ఉన్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం, కృష్ణ జన్మాష్టమి వరుసగా రెండు రోజులు వస్తుంది. అష్టమి తిథి సెప్టెంబర్ 06, 2023న సాయంత్రం 15:37 గంటలకు మొదలై సెప్టెంబర్ 07 సాయంత్రం 4:14 గంటలకు ముగుస్తుంది కనుక అది రెండు రోజులూ చూపిస్తుంది.

రోహిణి నక్షత్రం 2023 జన్మాష్టమికి సెప్టెంబర్ 6 ఉదయం 09:20 గంటలకు మొదలవుతుంది అయితే మరుసటి రోజు సెప్టెంబర్ 7 ఉదయం 10:25 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రం మరియు అష్టమి తిథి రాత్రి సమయము కలిసినందున శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 6వ తారీఖున జరుపుకుంటారు.

Image Credit : Reddit

Varalakshmi Vratam: ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ఆచరించే వరలక్ష్మీ వ్రతం, సనాతన ధర్మ సాంప్రదాయం.

కృష్ణ జన్మాష్టమి 2023: పూజ ముహూర్తం

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున పూజకు అనుకూలమైన సమయం రాత్రి 11:57 గంటలకు మొదలవుతుంది, అర్ధరాత్రి 12.42 గంటల వరకు లడ్డూ గోపాల్ జయంతి, పూజలు ఉంటాయి. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి రెండు శుభ యోగాల మీద పడుతోంది. ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి రోజున రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం–జన్మాష్టమి( నాడు మొత్తం రోజంతా ఉంటుంది– ఈ యోగం భక్తుల కోరికలన్నింటినీ శ్రీ కృష్ణుడు తీర్చే శుభదినం. ఈ యోగం లో చేసే పనులన్నీ భక్తులకు ఎన్నో పుణ్యఫలాలను కలుగజేస్తాయి నమ్ముతారు. రవి యోగం ఉదయం 06:01 నుండి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 09:20 వరకు ఉంటుంది.

జన్మాష్టమి 2023 ఉపవాస సమయం

జన్మాష్టమి వ్రతం సహజంగా శ్రీ కృష్ణుడు పుట్టిన తర్వాత చేస్తారు. ఈ సంవత్సరం భక్తులు రాత్రి 12:42 తర్వాత జన్మాష్టమి యొక్క పరణాన్ని చూడవచ్చు. జన్మాష్టమి తరువాత రోజు సూర్యోదయం తర్వాత జరుపుకుంటే, భక్తులు సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 06:02 నుండి జరుపుకోవచ్చు

దహీ హండి 2023 (తెలుగు రాష్ట్రాలలో ఉట్టి కొట్టే పండుగ)

జన్మాష్టమి తర్వాత మరుసటి రోజు ఉదయం దహీ హండిని అత్యంత కోలాహలంగా, ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం
దహీ హండి పండుగను సెప్టెంబర్ 7, గురువారం రోజున జరుపుకుంటారు

Leave A Reply

Your email address will not be published.